ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం మొదలెట్టిన బాబు?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా ముందడుగులు వేస్తున్నారు. నిన్నటివరకు అంతర్వేది రథం ఘటనను అడ్డం పెట్టుకొని జగన్ సర్కార్ పై విమర్శలు చేసిన చంద్రబాబు జగన్ ఆ కేసును సీబీఐకి అప్పగించడంతో కుల రాజకీయాలు మొదలుపెట్టారు. జగన్ సర్కార్ ను మరోమారు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ సర్కార్ అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగించడం సంతోషకరమని… అయితే రాష్ట్రంలో దళితులపై […]

Written By: Navya, Updated On : September 12, 2020 2:43 pm
Follow us on

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా ముందడుగులు వేస్తున్నారు. నిన్నటివరకు అంతర్వేది రథం ఘటనను అడ్డం పెట్టుకొని జగన్ సర్కార్ పై విమర్శలు చేసిన చంద్రబాబు జగన్ ఆ కేసును సీబీఐకి అప్పగించడంతో కుల రాజకీయాలు మొదలుపెట్టారు. జగన్ సర్కార్ ను మరోమారు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

జగన్ సర్కార్ అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగించడం సంతోషకరమని… అయితే రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులకు సంబంధించిన కేసును కూడా సీబీఐకు అప్పగించాలని సరికొత్త డిమాండ్ కు బాబు తెరలేపుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక వర్గంపై జరిగిన దాడులకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బాబు కుల రాజకీయలకు తెర లేపుతున్నారు. అయితే బాబు డిమాండ్లపై సొంత పార్టీ నేతల నుంచి, ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ డిమాండ్ తో పాటు శిరోముండనం బాధితులకు ప్రభుత్వం 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని… వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని… దళితులపై జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం పరిహారంతో పాటు ఉద్యోగం కల్పించాలని చంద్రబాబు కోరారు. అయితే బాబు అర్థంపర్థం లేని డిమాండ్లు విని జనం నవ్వుతున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న నేత కోరాల్సిన డిమాండ్లు ఇవేనా…? అని ప్రశ్నిస్తున్నారు.

నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన దానికి జగన్ సర్కార్ కు సంబంధం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి. చంద్రబాబు డిమాండ్లు దళిత సంఘాల నాయకులకే చీదరింపు తెప్పిస్తున్నాయంటే ఆయన డిమాండ్లు ఏ స్థాయిలో ఉన్నాయో సులభంగానే అర్థమవుతుంది. ఇప్పటికే దళిత ద్రోహిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత కూడా దళితుల పేర్లతో రాజకీయాలు చేస్తుండటం గమనార్హం. వైసీపీ నేతలు విమర్శలు చేస్తే మాత్రమే బాబు నోటికి తాళం పడుతుందని చెప్పవచ్చు.