జగన్ స్కెచ్.. చంద్రబాబుకు గట్టిగానే తగలనుందా?

ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. కుల ప్రస్తావన లేకుండా ఇక్కడి నేతలు రాజకీయాలు చేసిన పాపానా పోలేదు. కుల రాజకీయాలు చేయడం టీడీపీది అందెవేసిన చేయి. అయితే గత ఎన్నికల్లో టీడీపీ దెబ్బతిని వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ సైతం టీడీపీని మించిపోయేలా ఏపీలో కుల రాజకీయాలు చేస్తుండటం గమనార్హం. Also Read: విజయసాయి, రోజా టాక్ వైసీపీకి రివర్స్ అవుతోందా? టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీ కులాలే ఆ పార్టీని ఆదుకుంటున్నాయి. టీడీపీ […]

Written By: NARESH, Updated On : September 12, 2020 3:31 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. కుల ప్రస్తావన లేకుండా ఇక్కడి నేతలు రాజకీయాలు చేసిన పాపానా పోలేదు. కుల రాజకీయాలు చేయడం టీడీపీది అందెవేసిన చేయి. అయితే గత ఎన్నికల్లో టీడీపీ దెబ్బతిని వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ సైతం టీడీపీని మించిపోయేలా ఏపీలో కుల రాజకీయాలు చేస్తుండటం గమనార్హం.

Also Read: విజయసాయి, రోజా టాక్ వైసీపీకి రివర్స్ అవుతోందా?

టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీ కులాలే ఆ పార్టీని ఆదుకుంటున్నాయి. టీడీపీ అధికారంలోకి రావడానికి బీసీ ఓటు బ్యాంకు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే కిందటి ఎన్నికల్లో వీరంతా వైసీపీ వైపు మొగ్గుచూడటంతో టీడీపీ దారుణంగా ఓటమి చెందింది. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో వారు జగన్ కు మద్దతు ప్రకటించారు. దీంతో వైసీపీ బంపర్ మోజార్టీతో అధికారంలోకి వచ్చింది.

వైసీపీ పార్టీకి తొలి నుంచి ఓసీలు అండగా ఉంటున్నారు. రెడ్డి, వెలమ, ఇతర కులాలు వైసీపీకి మద్దతు ఇస్తున్నాయి. కిందటి ఎన్నికల్లో తనకు పూర్తి మద్దతు ఇచ్చిన బీసీలను తనవైపు మరలుచుకునేలా జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం సంక్షేమ కార్యక్రమాలు.. పదవుల్లో వారికే పెద్దపీఠ వేస్తున్నారు. బీసీ ఓటు బ్యాంకును దగ్గరకు చేర్చుకోవడం ద్వారా టీడీపీకి గట్టి దెబ్బకొట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారు.

బీసీలను ఆకట్టుకుంటూనే ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలను జగన్ అక్కున చేర్చుకుంటున్నారు. ఓసీల్లో మెజార్టీ వారంతా జగన్ కే జై కొడుతున్నారు. వీరందరి మద్దతు కూడగట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్ భావిస్తున్నారు. అయితే కుల సమీకరణాల్లో తేడా వస్తే మాత్రం అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీసీలను ఆకట్టుకునే క్రమంలో మిగతా కులాలకు ప్రాధాన్యం తగ్గిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Also Read: మోదీని ఎదురించే దమ్ము జగన్ కు ఉందా….?

దీంతో జగన్ సర్కార్ ఆచితూచి అడుగువేస్తోంది. బీసీలను టీడీపీ దూరం చేయడం ద్వారా వచ్చే ఆ ఎన్నికల్లో ఆ పార్టీని కోలుకుండా చేయాలని జగన్ భావిస్తున్నారు. ఒకవేళ బీసీలు జగన్ వైపు వెళితే మాత్రం టీడీపీ వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి చెందాడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీలను ఆకట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో వేచి చూడాల్సిందే..!