Vijay Deverakonda- Rashmika Mandana: రష్మిక మందాన కెరీర్ లో చాలా వేగంగా ఎదిగారు. పరిశ్రమకు వచ్చిన రెండు మూడేళ్ళలోనే స్టార్ హీరోయిన్ హోదా పట్టేశారు. నేషనల్ క్రష్ గా పేరుగాంచిన రష్మిక, టాలీవుడ్ టు బాలీవుడ్ దున్నేస్తున్నారు. అయితే రష్మిక కెరీర్లో వివాదాలు కూడా ఉన్నాయి. పరిశ్రమకు వస్తూనే ప్రేమలో పడింది. కన్నడ నటుడు రక్షిత్ శెట్టికి జంటగా కిరాక్ పార్టీ మూవీ చేసిన రష్మిక, ఆయన్ని ప్రేమించారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని కండీషన్ పెట్టడంతో… రష్మిక మనసు మార్చుకున్నారు. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.

రక్షిత్ శెట్టితో బ్రేకప్ తర్వాత రష్మిక హీరో విజయ్ దేవరకొండకు దగ్గరయ్యారనే పుకారు ఉంది. వీరు బెస్ట్ ఫ్రెండ్స్, అందులో సందేహం లేదు. ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ అనేకమార్లు కెమెరా కంటికి చిక్కారు. అలాగే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఇండస్ట్రీ నుండి రష్మిక మాత్రమే హాజరవుతారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ తో రష్మిక కలిసిపోతారు. అయితే తమ మధ్య ఏమీ లేదని, మంచి మిత్రులమంటూ పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు.
రష్మిక-విజయ్ దేవరకొండ మీద లవ్ ఎఫైర్ రూమర్స్ రావడానికి మరొక కారణం ఇద్దరూ కలిసి రెండు చిత్రాలు చేశారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో వీరి కెమిస్ట్రీ అద్భుతం. ఈ రెండు చిత్రాల్లో ఇద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా డియర్ కామ్రేడ్ మూవీలో హద్దులు దాటి లిప్ లాక్ సీన్స్ లో నటించారు. ఈ ముద్దు సన్నివేశాలపై రష్మిక తాజా ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. ఆ సన్నివేశాల కారణంగా తనకు ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.

డియర్ కామ్రేడ్ మూవీలో లిప్ లాక్ సన్నివేశాలు విపరీతంగా ట్రోల్స్ కి గురయ్యాయి. పబ్లిసిటీ కోసమే రష్మిక, విజయ్ దేవరకొండ ఇలా చేశారంటూ విమర్శలు గుప్పించారు. లిప్ లాక్ సన్నివేశాలపై పుట్టుకొస్తున్న ట్రోల్స్ మానసిక వేదనకు గురి చేశాయి. నిద్రలో పీడకలలు వచ్చేవి. ఏది నిజమో ఏది కలో అర్థమయ్యేది కాదు. రాత్రి వేళల్లో లేచి బెడ్ పై కూర్చొని ఏడ్చే దానిని.. అంటూ రష్మిక చెప్పుకొచ్చారు. తన లేటెస్ట్ మూవీ గుడ్ బై చిత్ర ప్రమోషన్స్ లో ఈ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ట్రోల్స్ వలన వేదనకు గురైనట్లు ఆమె తెలియజేశారు. విజయ్ దేవరకొండతో నాకు ఎఫైర్ ఉందని వచ్చే రూమర్స్ భలే క్యూట్ గా ఉన్నాయనిపిస్తుందని చెప్పడం విశేషం. రష్మిక నటించిన గుడ్ బై మూవీ అక్టోబర్ 7న విడుదల కానుంది.