ఫోన్ లో అడ్డంగా దొరికిపోతున్న బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గతంలో ఫోన్ సంభాషణ కేసులో అడ్డంగా దొరికిపోయిన ఆయన తాజాగా మరో సంఘటనలో కూడా ఇదే తీరుగా ఇరుక్కున్నారు. అధికారం రాజమార్గంగా ఉండాలే కాని అడ్డదారుల్లో ఉండకూడదు. అధికారం దక్కించుకోవాలనే తపనతో చిక్కుల్లో పడుతున్న ఘటనలు కోకొల్లలు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వానికి షాకిచ్చేందుకు ప్రయత్నించి బుక్ అయిన వైనం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విషయంలో కూడా ఇదే […]

Written By: Srinivas, Updated On : July 20, 2021 1:35 pm
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గతంలో ఫోన్ సంభాషణ కేసులో అడ్డంగా దొరికిపోయిన ఆయన తాజాగా మరో సంఘటనలో కూడా ఇదే తీరుగా ఇరుక్కున్నారు. అధికారం రాజమార్గంగా ఉండాలే కాని అడ్డదారుల్లో ఉండకూడదు. అధికారం దక్కించుకోవాలనే తపనతో చిక్కుల్లో పడుతున్న ఘటనలు కోకొల్లలు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వానికి షాకిచ్చేందుకు ప్రయత్నించి బుక్ అయిన వైనం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విషయంలో కూడా ఇదే విధంగా దొరికినట్లు తెలుస్తోంది.

రూ.50 లక్షలు లంచం ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దీనికి ముందు స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్ సంభాషణ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు అప్పుడు ఎంత వైరల్ అయిందో అందరికి తెలుసు. ఈ ఎపిసోడ్ లో బాబు ఫోన్ సంభాషణ ఆయన్ను దోషిగా నిలబెట్టింది. రాజకీయంగా దెబ్బతీసింది. పదేళ్ల పాటు హైదరాబాద్ లో ఉండాల్సిన దానికి భిన్నంగా అప్పటికప్పుడు హడావిడిగా భాగ్యనగరాన్ని వదిలేయాల్సిన అవసరం ఏర్పడింది.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో కూడా చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. రఘురామను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు ఆయన ఫోన్ స్వాధీనం చేసుకుని అందులోని డేటాను విశ్లేషించగా నివ్వెరపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో దాఖలుచేసిన పిటిషన్ కు సంబంధించిన అంశాల్ని బాబు నేరుగా పరిశీలించారనే సీఐడీ నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ముందు రఘురామ స్వయంగా ఆ కాపీని చంద్రబాబుకు వాట్సాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో మార్పు చేర్పుల కోసం వాట్సాప్ చాట్స్ చేసుకున్న వైనం గుర్తించారు. దీంతో అప్పట్లోనే ఫోన్ షాక్ తో రాజకీయంగా దారుణంగా దెబ్బ తిన్న బాబు మరోసారి ఎదురుదెబ్బ తిన్నారని అనిపిస్తోంది. ఈ సారి మాత్రం ఫోనే కీ రోల్ ప్లే చేయడం గమనార్హం. చంద్రబాబుకు ఫోన్ రాజకీయాలు అంతగా అచ్చిరాలేదన్న విషయం తెలుస్తోంది.