https://oktelugu.com/

కేంద్ర మంత్రివర్గంలో వైసీపీకి ఛాన్స్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ పొత్తు ఉందా..? అంటే అర్థం కాని విషయమే. కేంద్రంలో మద్దతు ఉంటుంది గానీ.. రాష్ట్రంలో కాదు.. అని వైసీపీ నేతలు అంటుంటారు.. అంటే రాష్ట్రానికి నిధులు, ఇతర అవసరాలు గుర్తుకువచ్చినప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు అని… ఏదైనా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకమన్నట్లు ఇరు పార్టీల నేతల వ్యవహరిస్తారు. త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో క్లారిటీ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 30, 2021 / 07:26 AM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ పొత్తు ఉందా..? అంటే అర్థం కాని విషయమే. కేంద్రంలో మద్దతు ఉంటుంది గానీ.. రాష్ట్రంలో కాదు.. అని వైసీపీ నేతలు అంటుంటారు.. అంటే రాష్ట్రానికి నిధులు, ఇతర అవసరాలు గుర్తుకువచ్చినప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు అని… ఏదైనా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకమన్నట్లు ఇరు పార్టీల నేతల వ్యవహరిస్తారు. త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో క్లారిటీ రానుంది.

    కేంద్రం బీజేపీ వైసీపీకి కొన్ని ఆపర్లు ప్రకటించిందట. త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో మూడింటిని ఇస్తానని తెలిపిందట. ఏపీ నుంచి 23 మంది ఎంపీలున్నా ఒక్కరూ కేంద్ర మంత్రివర్గంలో లేరు. దీంతో ఇప్పుడు అవకాశం ఇస్తానని ఢిల్లీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. ఏపీకి చెందిన ఎంపీ ఒక్కరు కూడా కేంద్ర మంత్రి వర్గంలో లేకపోవడంతో అభివృద్ధి పనులు కూడా ఆగిపోతున్నాయని, దీంతో అవకాశాన్ని వినియోగించుకోవాలని వైసీపీ కూడా ఎదురుచూస్తుందట.

    ఇక వైసీపీకి మూడు పదవులు ఇస్తానని చెప్పారట. వారిలో ఒకటి విజయసాయిరెడ్డికి కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంది. మిగతా రెండింటిలో ఒకటి బీసీ, మరొకటి ఎస్సీకి కేటాయించనున్నారు. బీసీఎంపీలలో మార్గాని భరత్ పేరు వినిపిస్తోంది. ఇక ఎస్సీ కోటాలో ఇటీవల తిరుపతి నుంచి ఎన్నికైన గురుమూర్తి పేరు పరిశీలనలో ఉంది. మూడు ప్రాంతాలకు చెందిన నాయకులతో పాటు మూడు సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా కేటాయించే అవకాశం ఉంది.

    రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కేంద్ర అనుమతితో ముడిపడి ఉన్నాయి. పార్టీ నుంచి మంత్రివర్గంలో ఉంటే నిధులను నేరుగా తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో బీజేపీతో పొత్తు విషయంలో ఎవరేమి అనుకున్నా రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రి వర్గం అవకాశాన్ని వినియోగించుకోవాలని వైసీపీ నేత భావిస్తున్నాడట. మరి ఆ మూడు పదవుల విషయంలో వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.