Etela Rajender: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తి కర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు ఆరంభించాయి. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరింటిని టీఆర్ఎస్ గెలుచుకోగా మిగిలిన ఆరింటిపై ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార పార్టీని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ కూడా తమ శక్తియుక్తుల్ని ప్రదర్శించి టీఆర్ఎస్ హవాను తగ్గించాలని చూస్తున్నాయి.
ఇందుకోసమే స్థానిక ప్రజాప్రతినిధులను శిబిరాలకు తరలించాయి. హుజురాబాద్ లో టీఆర్ఎస్ విజయాన్ని దెబ్బతీసిన ఈటల రాజేందర్ కరీంనగర్ లో కూడా మరోమారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరును కట్టడి చేయాలని చూస్తోంది. ఇందు కోసమే టీఆర్ఎస్ రెబల్ గా మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ను బరిలో దించినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ప్రజాప్రతినిధులను తమ శిబిరాలకు తరలించారు.
ఎక్కువగా పెద్దపల్లి, మంథని ప్రాంతాలపైనే గురి పెట్టారు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను శిబిరాలకు తరలించి అధికార పార్టీకి విజయం దక్కకుండా చేసేందుకు అటు శ్రీధర్ బాబు, ఇటు ఈటల రాజేందర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో రెండు స్థానాల్లో అధికార పార్టీకి విజయం దక్కకుండా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read: TRS MPs : టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామాలు చేస్తారా?
హుజురాబాద్ లో 181, మంథనిలో 98 ఓట్లు ఉండటంతో ఇక్కడ అధికార పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే టీఆర్ఎస్ ను ఎలాగైనా కట్టడి చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో శ్రీధర్ బాబు, ఈటల రాజేందర్ ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ కాంగ్రెస్ సీనియర్ నేత చల్మెడ లక్ష్మీనరసింహారావు టీఆర్ఎస్ లో చేరనుండటంతో తమకే విజయావకాశాలున్నాయని టీఆర్ఎస్ భావిస్తోంది. మొత్తానికి ఫలితాలు ఏ విధంగా మారతాయో వేచి చూడాల్సిందే.
Also Read: Drunkards: కేసీఆర్ కు వ్యతిరేకంగా రోడ్లపైకొచ్చిన మందుబాబులు..!