https://oktelugu.com/

ఉద్యోగులకు మేలు చేసేలా కేంద్రం కొత్త నిబంధనలు..?

కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ అమలు తర్వాత కేంద్రం దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనాపై ప్రజల్లో భయం తగ్గుతున్న నేపథ్యంలో కేంద్రం ఆర్థికవ్యవస్థ పుంజుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో ఉద్యోగులు కరోనా బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనల్లో కొన్ని నిబంధనలు ఉద్యోగులకు మేలు చేసేలా ఉన్నాయి. కేంద్రం అమలులోకి తెచ్చిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 3, 2020 5:41 pm
    Follow us on

    కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ అమలు తర్వాత కేంద్రం దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనాపై ప్రజల్లో భయం తగ్గుతున్న నేపథ్యంలో కేంద్రం ఆర్థికవ్యవస్థ పుంజుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో ఉద్యోగులు కరోనా బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది.

    ఈ నిబంధనల్లో కొన్ని నిబంధనలు ఉద్యోగులకు మేలు చేసేలా ఉన్నాయి. కేంద్రం అమలులోకి తెచ్చిన కొత్త నిబంధనలను తెలుసుకుంటే ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉండవు. కేంద్రం ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని.. ఈ విధంగా హెచ్.ఆర్ పాలసీలను సవరించాలని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ సంస్థలో పని చేసే ఉద్యోగులు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని వెల్లడించిందీ.

    ఎవరైతే భౌతిక దూరం నిబంధనలను పాటించరో అప్రైజల్ సమయంలో ఆ ఉద్యోగులపై ఎఫెక్ట్ పడనుంది. కంపెనీలు సమీపంలోని ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని.. స్పెషల్ లీవ్ పాలసీని ఉద్యోగుల కొరకు అందుబాటులోకి తీసుకురావాలని.. లిఫ్ట్ కంటే మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు చేసింది. ఆఫీసుల్లో థర్మల్ స్క్రీంగ్ ఫెసిలిటీతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

    30 నుంచి 40 శాతం కెపాసిటీకి మించకుండా ఉద్యోగుల ట్రాన్స్ పోర్ట్ వాహనాలను వినియోగించాలని కేంద్రం పేర్కొంది. 65 సంవత్సరాల వయస్సు పైబడిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలని కేంద్రం నిబంధనలు అమలులోకి తెచ్చింది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.