https://oktelugu.com/

కేంద్రం సంచలనం.. సైన్యం సిద్ధంగా ఉండాలని ఆదేశం

గడిచిన నెలరోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈనేపథ్యంలోనే భారత్-చైనా మధ్య ఇటీవల ఆర్మీ, దౌత్య ఉన్నతాధికారులు చర్చలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే ఎల్ఓసీ నుంచి ఇరుదేశాల సైనికులు తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఘర్షణ చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 3గంటల సమయంలో ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కల్నల్ స్థాయిలో అధికారితోపాటు 19మంది సైనికులు వీరమరణం పొందారు ఈ ఘటనపై యావత్ దేశం వీరజవాళ్లకు కన్నీటి నివాళి పలుకుతోంది. సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో చైనా భారత్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 17, 2020 8:10 pm
    Follow us on


    గడిచిన నెలరోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈనేపథ్యంలోనే భారత్-చైనా మధ్య ఇటీవల ఆర్మీ, దౌత్య ఉన్నతాధికారులు చర్చలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే ఎల్ఓసీ నుంచి ఇరుదేశాల సైనికులు తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఘర్షణ చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 3గంటల సమయంలో ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కల్నల్ స్థాయిలో అధికారితోపాటు 19మంది సైనికులు వీరమరణం పొందారు ఈ ఘటనపై యావత్ దేశం వీరజవాళ్లకు కన్నీటి నివాళి పలుకుతోంది.

    సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో చైనా భారత్ ను దొంగదెబ్బతీసింది. సరిహద్దుల్లో వెయ్యమంది చైనా జవాన్లు భారత సైనికులతో రాళ్లు, రాడ్లతో దాడికి దిగారు. దీంతో భారత సైనికులు ప్రతిదాడి చేశారు. ఈ సంఘటనలో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అదేవిధంగా చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే చైనా మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించలేదు. ఈసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో మృతిచెందిన కల్నల్ సంతోష్ బాబు తెలుగువాడు కావడం గమనార్హం. ఆయన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందినవాడు. ఆయన మృతితో సూర్యాపేటలో తీవ్రవిషాదం నెలకొంది.

    ఈ ఘటనపై రక్షణ శాఖా మంత్రి సైనికాధికారులతో పలుదఫాలుగా చర్చించారు. సైనికుల త్యాగం వృథాకాదని వారిలో ఆత్మస్థైర్యం నింపారు. ఈ విషయంపై ప్రధానితో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు సరిహద్దుల్లో భద్రతను పర్యవేక్షిస్తున్న ఆర్మీ కమాండర్లలకు పరిస్థితిని బట్టి స్వయంగా నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిది. తమకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వడంపై ఆర్మీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ దళాల అధిపతులకు కేంద్రం ఆదేశాలను జారీ చేసింది. భారత్-చైనా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసింది.