పంతం నెగ్గించుకున్న టీడీపీ..!

శాసన మండలిలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీడీపీకి మెజారిటీ సభ్యులు ఉండటంతో అధికార పక్షానికి ఇబ్బందులు తప్పడం లేదు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మండలిలో ఆమోదం విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి ప్రభుత్వంపై పైచేయి సాధించింది. ఈ రెండు బిల్లులను ఎలాగైనా ఆమోదింప చేసుకోవాలని భావించిన ప్రభుత్వం ఎటువంటి సవరణలు లేకుండా రెండవసారి శాసన సభలో ఆమోదించి మండలికి పంపింది. గతంలో మండలి ఏ బిల్లులపై చర్చ జరిపి సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం […]

Written By: Neelambaram, Updated On : June 18, 2020 10:02 am
Follow us on


శాసన మండలిలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీడీపీకి మెజారిటీ సభ్యులు ఉండటంతో అధికార పక్షానికి ఇబ్బందులు తప్పడం లేదు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మండలిలో ఆమోదం విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి ప్రభుత్వంపై పైచేయి సాధించింది. ఈ రెండు బిల్లులను ఎలాగైనా ఆమోదింప చేసుకోవాలని భావించిన ప్రభుత్వం ఎటువంటి సవరణలు లేకుండా రెండవసారి శాసన సభలో ఆమోదించి మండలికి పంపింది. గతంలో మండలి ఏ బిల్లులపై చర్చ జరిపి సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆ విషయం ఏమీ తెలకుండా, మరోసారి బిల్లులు ఎలా ప్రవేశపెడతారని టీడీపీ అడ్డు తగిలింది.

మూడు నెలల సమయం దాటినందున అధికార పక్షం బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని, బిల్లులపై చర్చించాలని అధికార పక్షము పట్టుబట్టింది. ముందు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చిచాలని టీడీపీ సభ్యులు కోరడంతో డిప్యూటీ ఛైర్మెన్ అనుమతి ఇచ్చారు.అనంతరం నెలకొన్న గందరగోళం, కేకలు, సభ ఆర్డర్ తప్పె పరిస్థితి నెలకొనడంతో డిప్యూటీ ఛైర్మెన్ సభను నిరవధిక వాయిదా వేశారు. దీంతో తొలుత మూడు రోజులు మండలిని నిర్వహించాలని నిర్ణయించిన రెండు రోజులకే సమావేశాలు పరిమితం అయ్యాయి.

బిల్లులు ఆమోదించకుండా సభను వాయిదా వేయండంలో టీడీపీ వ్యూహం స్పష్టం అవుతుంది. శాసన మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఆ పార్టీకి చెందిన వారే కావడంతో టీడీపీ బిల్లులను ఆమోదించకుండా సభను వాయిదా వేయించుకోగలిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలోని తన ఛాంబర్ లోనే మండలి సమావేశాలు ముగిసే వరకూ ఉన్నారు. సభ్యులకు తగు సూచనలు ఇస్తూ ప్రభుత్వ రాజధాని తరలింపు నిర్ణయానికి చట్టపరంగా చెక్ పెట్టారు. దీంతో విశాఖకు రాజధానిని తరలించే విషయంలో ప్రభుత్వానికి మరికొన్నాళ్లు అడ్డంకులు తప్పవు. ఎందుకంటే చట్ట సభలు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించే వరకూ రాజధానిని తరలించమని ఈ అంశంపై దాఖలైన కేసులో హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించింది.