Telangana: తెలంగాణపై ఇప్పటికే బీజేపీ ఫోకస్ చేసిందనేది ఓపెన్ సీక్రెట్. ఆ పార్టీ నేతలు కూడా అప్పుడప్పుడు మీ పని అయిపోతుంది.. మీ అంతు చూస్తూం అంటూ అధికార పార్టీకి వార్నింగులు ఇస్తుండటం అందరికీ తెలిసిందే. టైందొరికినప్పుడల్లా టీఆర్ ఎస్ అధినేత కూడా ఫ్రంట్ పెడతాం… దేశంలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తాం.. కేంద్రం మెడలు వంచుతాం అనడం…ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార పార్టీ నేతలపై, వారి ఆదాయ మార్గాలపై కేంద్ర దర్యాప్తు బృందాలు ఇప్పటికే నిఘా వేశాయని రేపోమాపో దాడి చేయోచ్చనే వార్తాలు చక్కర్లు కొడుతున్నాయి. ఎలాంటి సమాచారం బయటకు రాకుండా.. దెబ్బకొట్టనున్నట్లు సమాచారం. అలా చేసిందంటే ఆ నేతలు కూడా చేసేదేముండదని.. సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుందని చర్చ జరుగుతోంది.
అయితే బీజేపీ పాలిటిక్స్ లో ఇన్వెస్టిగేషన్ సంస్థలకు మంచి ప్రాధాన్యత ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే. అందుకే ప్రతిపక్షాలు కూడా అనుభంద సంస్థ అంటూ ఆరోపణలు చేస్తుంటాయి.. మహారాష్ట్రలో శివసేన గతంలో ఇలాంటి అరోపణలే చేసింది. అయితే ఇది బీజేపీ పాలిటిక్స్ లో భాగమా.. లేక బెదిరించే ప్రయత్నమా.. అనేది పక్కనపెడితే.. కొంతమందికి ఇది తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. గతంలో చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాక సీబీఐ ఎంక్వైరీలంటూ ఎంత అడావుడి జరిగిందో మనకు తెలిసిందే.. టీడీపీ నేతలపై దాడులు జరగడం కూడా మనం చూశాం. టీడీపీ నేతలు కూడా ఎంత టెన్షన్ పడ్డారో తెలిసిందే. చివరికి సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్‌ను చంద్రబాబు రద్దు చేశారు కూడా.
Also Read: ఢిల్లీలో కేసీఆర్ నిరసన.. కేంద్రం తగ్గేలా లేదే..!
గతంలో మాదిరి అదే పరిస్థితి ఇప్పుడు టీఆర్ఎస్ నేతలకు వస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. కొంత మంది బీజేపీ నేతలు కూడా లెక్కలన్నీ తెలుస్తాం అనడం ఇందుకు ఊతమిస్తోంది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల్లో సబ్ కాంట్రాక్టులు చేస్తున్న కంపనీలపై ఇప్పటికే దాడులు జరుగుతున్నాయనేది తెలిసిన విషయమే.. అయితే రీసెంట్ గా కేసీఆర్ తో సన్నిహత్యంగా ఉండే ఇద్దరిని కూడా దూరం చేసినట్లు ఇది బీజేపీ నిఘాలో భాగమేనని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మరింత టార్గెట్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.
Also Read: భద్రాద్రికి రోడ్డు మార్గంలో వెళ్లిన గవర్నర్.. సర్కారు కావాలనే హెలికాప్టర్ సమకూర్చలేదా?