AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. పాతవారు 11 మందితోపాటు కొత్తవారు 14తో కలిపి కేబినెట్ విస్తరణ పూర్తి చేశారు. దీంతో ఈసారి సమర్థులైన వారికే పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి పనితీరే వారికి శ్రీరామరక్షగా భావించి జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ విస్తరణ కూర్పుకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం.
రాష్ర్టంలో ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు తిడితే వారికి అందలాలు ఇవ్వడం తెలిసిందే. ఈ సారి కూడా అదే ఫార్ములాను ఉపయోగించుకుని మంత్రి పదవులు కేటాయించినట్లు తెలుస్తోంది. నోటి దురుసు ఉన్న వారికే ప్రాధాన్యం ఇచ్చారనే వాదనలు కూడా వస్తున్నాయి. మంత్రి కొడాలి నాని రాజీనామా అనంతరం పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కు మంత్రి పదవి ఇదే కోవలో వచ్చినట్లు చెబుతున్నారు.
నాని వారసుడిగా రంగ ప్రవేశం చేసిన రమేష్ ప్రస్థానం ఓ విచిత్రమైన పద్ధతుల్లో సాగిందని తెలిసిందే. చంద్రబాబుపై విరుచుకుపడాలన్నా ప్రతిపక్షాలను ఇష్టారాజ్యంగా తిట్టాలన్నా ఆయనకే చెల్లు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కు మంత్రి పదవి దక్కడం అందరిలో ఆశ్చర్యాన్ని నింపింది.
Also Read: ఏపీ కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు.. రోజా హోం మినిస్టర్ కాదు.. ఏ శాఖంటే?
శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావుకు మంత్రివర్గంలో స్థానం దక్కడంతో న్యాయమే గెలిచిందని చెబుతున్నారు. అమరావతిపై అసెంబ్లీలో చర్చకు తెరలేపి తనదైన శైలిలో తెరకెక్కిన నేతగా ధర్మానకు గుర్తింపు వచ్చింది. దీంతో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుని జగన్ సముచిత ప్రాధాన్యం ఇచ్చారు.
ఇక మరో ఎమ్మెల్యే అంబటి రాంబాబు. వైసీపీలో మరో సంచలనాల నేతగా గుర్తింపు పొందారు. ప్రతిపక్షాలకు చెక్ పెట్టడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. శాసనసభ వేదికగా ఆయన వాగ్బాణాలు ప్రత్యేకంగా ఉండటంతో ఆయనకు మంత్రి పదవి దక్కిందనే వాదనలు కూడా సవ్తున్నాయి. ఈనేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో జగన్ తనదైన ముద్ర వేశారనే విషయం తెలుస్తోంది.
Also Read: మంత్రిపదవులు రాకపోవడానికి ఆరోపణలే కారణాలా?