Homeజాతీయ వార్తలుMunugode By Election- BJP Survey: మునుగోడులో బీజేపీ గెలుపుపై కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే. ఆ...

Munugode By Election- BJP Survey: మునుగోడులో బీజేపీ గెలుపుపై కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే. ఆ రెండు పార్టీలకు బిగ్ షాక్ ?

Munugode By Election- BJP Survey: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ గెలుపు రేసులో పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇప్పటికే మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశాయి. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.  ఈనెల 15 నుంచి పక్షం రోజులపాటు ప్రచారంపైనే దృష్టిపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో విజయావకాశాలపై కేంద్ర ఇంటెలిజెన్స్‌ దృష్టిపెట్టింది. రంగంలోకి దిగి సర్వే చేసినట్టు తెలిసింది.

Munugode By Election- BJP Survey
Munugode By Election- BJP Survey

అమిత్‌షా ప్రత్యేక దృష్టి..
ఎవరు ఔనన్నా.. కాదన్నా.. మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కారణంగా వచ్చిందే. పార్టీ మారాను కాబట్టి.. ప్రజల తీర్పు కోరుతున్నానని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నారు. అయితే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సూచన మేరకే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో హోమంత్రి అమిత్‌షా ఈ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆయన ఆదేశాల మేరకే కేంద్ర ఇంటెలిజెన్స్‌ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారని ఇటీవల సర్వే చేసింది.

రేసులో వెనుకబడిర రాజగోపాల్‌రెడ్డి?
మునుగోడు ఉప ఎన్నికలో పోరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ చేసిన సర్వేలో టీఆర్‌ఎస్‌ కంటే రాజగోపాల్‌రెడ్డి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని గుర్తించింది. ఈమేరకు కేంద్ర నిఘా విభాగం నుంచి పార్టీ కేంద్ర నాయకత్వానికి ఇన్‌పుట్‌ అందినట్లు తెలిసింది. వ్యూహాలు రచించడంలో, ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనడంలో బీజేపీ కంటే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ముందుందని నిఘా వర్గాలు బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే వారు బీజేపీ వైపు మొగ్గు చూపకుండా కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపడంతో మునుగోడులో కాంగ్రెస్‌ కూడా బలపడుతుందని అంటున్నారు.

దిద్దుబాటు చర్యలు..
ఇంటెలిజెన్స్‌ నివేదిక ఆధారంగా బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎన్నికలకు ఇంకా పక్షం రోజుల సమయం ఉంది. ఈలోగా ఓటర్లను రాజగోపాల్‌రెడ్డివైపు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈమేరకే బీజేపీ జాతీయ నాయకత్వం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను హుటాహుటిన ఢిల్లీకి రప్పించినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీని హుక్‌ లేదా వంకరగా గెలిపించేలా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంంజయ్‌కు అనుకూల చర్యలు తీసుకోవాలని, ప్రచారంలో మరింత దూకుడుగా పాల్గొనాలని పార్టీ నాయకత్వం కోరుతోంది.

ప్రచారానికి జాతీయ నేతలు..
మునుగోడు విజయంతో తెలంగాణ మొత్తానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయే అని సంకేతం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు పార్టీ బలహీనతకు కారణాలు, రాజగోపాల్‌రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను అధిగమించేలా వ్యూహాలు రచిస్తోంది. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ ప్రచారానికి మించి ప్రతివ్యూహం రచించేలా బీజేపీ స్టేట్‌ చీఫ్‌కు దిశానిర్దేశం చేసింది. ఇదే సమయంలో ఈనెల 25 నుంచి జాతీయ నాయకులు కూడా మునుగోడు ప్రచారంలోకి వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తోంది. రాజగోపాల్‌రెడ్డికి దూరమైన కాంగ్రెస్‌ క్యాడర్‌ను కూడా కమలంవైపు తిప్పేలా ప్రణాళిక రచిస్తున్నారు.

అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక..
అధికార టీఆర్‌ఎస్‌ మునుగోడు ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి మంత్రాన్ని జపిస్తోంది. దీనిని తిప్పికొట్టడంతోపాటు ఎనిమిదేళ్లలో నియోజకవర్గానికి హామీ ఇచ్చి చేయని పనులను ప్రజలకు వివరించాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు టీఆర్‌ఎస్‌ విస్మరించిన హామీల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. చదువురాని ఓటర్లతోపాటు చదువుకున్న ఓటర్లకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు అర్థమయ్యేలా ఆకట్టుకునేలా డిజిటల్‌ ప్రచారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు సూచించింది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడొద్దని, ఆర్థికంగా అండగా ఉంటామన్న భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. మంత్రులు ఇచ్చే హామీలు.. వారి నియోజకవర్గాల్లో అవే హామీలు నెరవేర్చకపోయిన తీరుపై వీడియోలు ప్రచారం చేయాలని సూచించింది. అక్కడ చేయని నేతలు ఇక్కడ ఎలా చేస్తారో ఆలోచించాలని, మంత్రులను నిలదీసేలా ప్రజల్లో చైతన్యం తేవాలని కేంద్ర నాయకత్వం సూచించింది.

Munugode By Election- BJP Survey
Munugode By Election

సోషల్‌ మీడియా విస్తృత వినియోగం..
బీజేపీ విజయాల్లో సోషల్‌ మీడియా పాత్ర కూడా చాలా కీలకం. మునుగోడు ఎన్నికల్లోనూ వీలైనంత ఎక్కువగా సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. యువ ఓటర్లను ఆకట్టుకునేలా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని భావిస్తోంది. గులాబీ నేతల అవినీతి, కుటుంబ పాలన, నిరుద్యోగం, రుణమాఫీ, దళితబంధు, గొర్రెల పంపిణీలో లోపాలను ఎత్తి చూపలని సోషల్‌ మీడియా వింగ్‌కు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఆరు నూరైనా మునుగోడు గెలవాలన్నదే అధిష్టానం వ్యూహంగా తెలుస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version