కేంద్రం వర్సెస్‌ రైతు సంఘాలు

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఉద్యమం చేపట్టారు. నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ రైతులు హస్తిన వేదికగా తమ పోరాటాన్ని నడిపిస్తున్నారు. వీరి నిరసనలపై రాజకీయ వేడి సైతం అంతకంతకూ పెరుగుతోంది. రైతుల ఉద్యమం రాజకీయ ప్రేరితమంటూ విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌లకు ఘాటు రిప్లైతో కూడిన లేఖను రైతు సంఘాలు రాశాయి. Also Read: అయోధ్యలో మసీదు.. అబ్బురపరిచేలా ఉందిగా..! వివాదాస్పద […]

Written By: Srinivas, Updated On : December 20, 2020 2:18 pm
Follow us on


కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఉద్యమం చేపట్టారు. నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ రైతులు హస్తిన వేదికగా తమ పోరాటాన్ని నడిపిస్తున్నారు. వీరి నిరసనలపై రాజకీయ వేడి సైతం అంతకంతకూ పెరుగుతోంది. రైతుల ఉద్యమం రాజకీయ ప్రేరితమంటూ విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌లకు ఘాటు రిప్లైతో కూడిన లేఖను రైతు సంఘాలు రాశాయి.

Also Read: అయోధ్యలో మసీదు.. అబ్బురపరిచేలా ఉందిగా..!

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదాకా ఆందోళనలు కొనసాగుతాయని రైతులు స్పష్టం చేయడంతో మోదీ సర్కార్ మరోవైపు నుంచి ప్రయత్నాలను ప్రారంభించింది. అందులో భాగంగా బీజేపీ నేతృత్వంలో పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మాజీ ప్రధాని అటల్‌ బీహారీ పేయి జయంతి సందర్భంగా ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో సంభాషించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని 2500కిపైగా ప్రదేశాల్లో ‘కిసాన్‌ సంవాద్‌’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది. ఈ మేరకు సన్నాహాలను ముమ్మరం చేసింది. యూపీ బీజేపీ చీఫ్‌ స్వతంత్ర దేవ్‌సింగ్‌, పార్టీ నేత రాధామోహన్‌ సింగ్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల ఆ పార్టీ శ్రేణులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

కేంద్ర సర్కారు.. పేదల, రైతుల సంక్షేమానికి అంకితమైందని, కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి విపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని, ఈనెల 25న రైతులతో ప్రధాని మోదీ సంవాదంలో వాస్తవాలను వివరిస్తామని రాధామోహన్‌ సింగ్‌ అన్నారు. ఇప్పటిదాకా రైతుల ఉద్యమంపై కేంద్ర పెద్దలు వ్యతిరేక ప్రకటనలు చేస్తుండగా, ఇప్పుడు బీజేపీ నేరుగా రంగంలోకి దిగి, ప్రధానితో కిసాన్ సంవాద్ నిర్వహిస్తుండటం గమనార్హం.

Also Read: రైతుకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది?

మరోవైపు.. రైతుల ఉద్యమాన్ని రాజకీయ ప్రేరితమన్న ప్రధాని మోదీకి ఘాటు రిప్లై ఇచ్చిన రైతుల సంఘాలు.. 25న ప్రధాని నిర్వహించబోయే కిసాన్ సంవాద్ పైనా ఆగ్రహం వెళ్లగక్కాయి. ఆందోళనలపై కేంద్రం అదే పనిగా అబద్ధాలను ప్రచారం చేస్తుండటాన్ని నిరసిస్తూ, మోదీ కిసాన్ సంవాద్ చేపట్టే రోజునే (డిసెంబర్ 25న) ఉత్తరప్రదేశ్–-ఢిల్లీ సరిహద్దు (ఘాజీపూర్ బోర్డర్)ను పూర్తిగా స్తంభింపజేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్