https://oktelugu.com/

అదేపనిగా వెక్కిళ్లు వస్తున్నాయా.. ఆ వ్యాధే అంటున్న వైద్యులు…?

కరోనా మహమ్మారి గురించి పరిశోధనలు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు సంబంధించి మరో కొత్త లక్షణాన్ని గుర్తించారు. అదేపనిగా వెక్కిళ్లు వస్తే కరోనానే శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి వెల్లడించారు. వెక్కిళ్లు ఎంత ప్రయత్నించినా ఆగకపోతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. కొంతమంది కరోనా బాధితుల్లో కరోనాకు సంబంధించిన ఏ లక్షణాలు లేకపోయినా ఈ లక్షణం కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కిళ్లు వస్తే కరోనా అని చెప్పలేమని.. అదే పనిగా వెక్కిళ్లు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 20, 2020 / 02:14 PM IST
    Follow us on


    కరోనా మహమ్మారి గురించి పరిశోధనలు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు సంబంధించి మరో కొత్త లక్షణాన్ని గుర్తించారు. అదేపనిగా వెక్కిళ్లు వస్తే కరోనానే శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి వెల్లడించారు. వెక్కిళ్లు ఎంత ప్రయత్నించినా ఆగకపోతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. కొంతమంది కరోనా బాధితుల్లో కరోనాకు సంబంధించిన ఏ లక్షణాలు లేకపోయినా ఈ లక్షణం కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.

    ఎక్కిళ్లు వస్తే కరోనా అని చెప్పలేమని.. అదే పనిగా వెక్కిళ్లు వస్తే మాత్రం కరోనానే అని వైద్యులు వెల్లడిస్తున్నారు. 64 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తికి వెక్కిళ్లు ఆగకుండా వచ్చాయని.. ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్యులు చెబుతున్నారు. మరో 62 ఏళ్ల వ్యక్తిలో ఈ తరహా లక్షణాలే కనిపించినట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు. శాస్త్రవేత్తలు కరోనాకు, వెక్కిళ్లకు సంబంధం కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తున్నామని చెబుతున్నారు.

    వెక్కిళ్లు తరచుగా వస్తే ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశాలు ఉంటాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ బారిన పడకుండా రక్షించుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. వెక్కిళ్లు తరచుగా వస్తే ఆలస్యం చేసి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడవద్దని వైద్యులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చే వరకు ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు.

    ప్రజలు ఎప్పటికప్పుడు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అతి త్వరలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న తరువాత అనారోగ్య లక్షణాలు కనిపిస్తే రెండో డోస్ తీసుకోవద్దని చెబుతున్నారు.