spot_img
Homeజాతీయ వార్తలుFirst Class Admissions: స్కూళ్లలో ప్రవేశాలపై కేంద్రం కీలక నిర్ణయం!

First Class Admissions: స్కూళ్లలో ప్రవేశాలపై కేంద్రం కీలక నిర్ణయం!

First Class Admissions
First Class Admissions

First Class Admissions: మూడేళ్లుగా నూతన విద్యా విధానంపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్న కేంద్రం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తోంది. ఐదేళ్లు పూర్తయ్యేసరికి ఒకటో తరగతి పూర్తిచేస్తున్నారు నేటి కాలం పిల్లలు. ఈ నేపథ్యంలో కేంద్రం సంచల నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని రాష్ట్రాలను కోరింది. ఈమేరకు రాష్ట్రాలకు క్రమంగా దిశానిర్దేశం చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. ‘‘చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం–2020 సిఫార్సు చేసింది. పునాది దశలో విద్యార్థులకు అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో 3 ఏళ్లు పాఠశాల ముందస్తు విద్య(ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌), 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్‌ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం.

నాడు ఇదే విధానం..
ఒకప్పుడు పిల్లలను ఐదేళ్లు నిండితేనే బడికి పంపేవారు. ఆ లోపు ఇళ్లల్లో ఉండే పెద్దవారు, అమ్మనాన్నలు పిల్లలకు అవసరమైన విజ్ఞానాన్ని కథలు, పద్యాల రూపంలో నేర్పేవారు. అయితే నేటి కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పట్టుమని రెండేళ్లు కూడా నిండని పిల్లలను ప్లేస్కూల్‌ పేరిట బడికి పంపుతున్నారు. మూడేళ్లు వచ్చాయంటే.. ఇక ఆ చిన్నారులు బడిలో జాయిన్‌ కావాల్సిందే. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ నూతప విద్యావిధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ఆలోచన చేస్తోంది. దీని ప్రకారం ఇకపై ఆరేళ్లు నిండిన పిల్లలకే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. .

పునాది బలోపేతం కోసమే..
చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని మరింత బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జాతీయ విద్యావిధానం–2020 సూచిస్తోంది. దీని ప్రకారం.. అంగన్‌వాడీలు, ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్, ఎన్జీవోలు నిర్వహించే ప్రీ స్కూల్‌ కేంద్రాల్లో మూడేళ్లపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెవాలి. ప్రభుత్వ లక్ష్యం సాకారం కావాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించే దిశగా స్కూల్‌ అడ్మిషన్‌ ప్రక్రియలో సవరణలు చేయాలని కేంద్రం లేఖలో సూచించింది.

First Class Admissions
First Class Admissions

ప్రత్యేక శిక్షణ అవసరం..
ప్రభుత్వం ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో నడిచే ప్రీ స్కూల్స్‌ విద్యార్థులకు ఆమేరకు తగిన విధంగా భోదించే టీచర్లను రెడీ చేసుకోవాడానికి ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లోమా కోర్సును రూపొందించి అమలు చేయాలి. ఈ కోర్స్‌ను స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ద్వారా రూపొందించాలి. దీన్ని డిస్ట్రిక్ట్‌ ఎడ్యుకేషన్‌∙అండ్‌ ట్రైనింగ్‌లద్వారా అమలు చేయాఅని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలకు సూచించింది. మరి దీనిపై కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

 

సామాజిక న్యాయం, సంక్షేమం పేరుతో పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చటం సాధ్యమా ? || CM Jagan || Ok Telugu

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version