Polavaram Project: పోలవరం ప్రాజెక్టు.. దీని పేరులోనే వరం ఉంది కానీ ఇది పూర్తి కాకపోవడం ఏపీ ప్రజలకు శాపంగా మారుతోంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ చిరలకాల స్వప్నం. ఈ ప్రాజెక్టును ఎలాగైన తన హయంలో పూర్తి చేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడి సీఎం జగన్. అందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సాకారం చేసుకుంటున్నారు. ఇక అక్కడి వచ్చిన కేంద్ర పెద్దలు హామీలు గుప్పిస్తూ.. వరాలు కురిపిస్తుండటం కామన్ గా మారింది. తాజాగా కేంద్ర మంత్రి షెఖావత్ ప్రాజెక్టును సందర్శించారు. ఇక ఆ సమయంలో ఆయన మాటలు చెక్కరి మూటలేనని చెప్పాలి. ఈయన ఒక్కరే కాదు ఏ నాయకుడు అయిన ఏదైన ప్రదేశాన్ని సందర్శించేందుకు వెళితే దానికి అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ అక్కడి వారిని కలల ప్రపంచంలో విహరింపజేస్తారు.
కానీ పోలవరం విషయంలో అది అన్ని సార్లు సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాజెక్టు చాలా ఏళ్లుగా పెండింగ్ లోనే ఉంది. దీనిని సందర్శించిన నాయకులంతా ఎలాగైనా పూర్తి చేస్తామని హామీలు ఇవ్వడం తర్వాత దానిని మర్చిపోవడం పరిపాటిగా మారింది. ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర మంత్రి ఎట్టిపరిస్థితుల్లో సంవత్సరంలోగా దీనిని పూర్తి చేస్తామంటూ తడబడకుండా చెబుతూనే ఉన్నారు. ఇక ఆయన మాటలను సైతం అందరూ నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన అంతలా పోలవరం గురించి మాట్లాడారు.
అయితే ఇదిలా ఉండగా.. మరి బీజేపీ నాయకులను మాటడం నమ్మడం ఎలా? దీనికి తోడు ఏపీ ప్రభుత్వం వ్యవహారం ఎలా ఉంది అని ఒక సారి ఆలోచిస్తే.. ఈ ప్రాజెక్టు విషయంలో నాయకులపై ఎప్పుడో విశ్వాసాన్ని కోల్పోయారు అక్కడి ప్రజలు. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పినా.. ఎన్ని హామీలు ఇచ్చినా అవునా.. అంటున్నారే తప్ప.. వాటిని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒక వేళ నాయకులు చెప్పింది చెప్పినట్టుగా చేసి, కళ్ల ముందు నిరూపిస్తే తప్ప నమ్మేలా లేరు ప్రజలు. షెకావత్ సందర్శనకు వచ్చినప్పుడు అనేక విషయాల్లో హామీలిచ్చారు.
పునరావాసం సైతం పెంచుతామన్నారు. పరిహారం డబ్బులను నేరుగా లబ్ధదారుల అకౌంట్‌లో వేసేందుకు ఓకే చెప్పారు. రాబోయే మూడు నెలల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టు విషయంలో సమీక్ష నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. ఆయన నిజంగానే ఇలా సమీక్ష నిర్వహిస్తే పనుల్లో వేగం పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇలా నిజంగానే సమీక్షలు నిర్వహించి పనులు ముందుకు సాగేందుకు సహకరిస్తారో లేదో చూడాలి. కేంద్రం సైతం 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాలని సీఎం జగన్ కోరారు. అదే కనుక జరిగితే ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యే చాన్స్ ఉంది. మరి ఇన్ని హామీలు ఇచ్చిన కేంద్ర మంత్రి వాటిని నిలబెట్టుకుంటారో లేదా చూడాలి.
Also Read: KCR National Politics: కేసీఆర్‌పై ఆప్ నేత సంచలన కామెంట్స్.. సడెన్ గా ఏంటీ పరిణామం