Expensive Marriage In India: ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది ఓ వేడుక లాంటిది. అందుకే ఎవరి ఇంట్లో అయినా వివాహం జరుగుతుంటే ఆ వేడుకను నలుగురు మాట్లాడుకునేలా ఘనంగా నిర్వహించాలని పరితపిస్తుంటారు. అయితే వివాహం జరిపించడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఆడపిల్ల తండ్రి మాత్రమే భరిస్తాడు. దీనికి కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి ఖర్చు ఆడపిల్ల తండ్రి భరించడానికి బలమైన కారణం ఉంది.

ఎవరైనా సరే ఒక దానం నిర్వహించాలి అనుకున్నప్పుడు ఆ దానానికి సంబంధించిన వేదికను దానం చేయాలని భావించిన వారే ఏర్పాటు చేయాలి. అలాగే ఆడపిల్లవారు కన్యాదానం చేస్తారు కాబట్టి వివాహం కోసం ఏర్పాటు చేసే వేదిక కూడా కన్యాదానం చేసేవారిదే అవుతుంది. కనుక ఆ వేదికపై అధికారం ఆరోజు పూర్తిగా కన్యాదాతదే అని పురాణాలు చెప్తున్నాయని పండితులు వివరిస్తున్నారు.
Also Read: ఉక్రెయిన్ నుంచి తెచ్చిన విద్యార్థులనూ ప్రచారానికి వాడుకోవడం ఏంటీ మోడీసారూ?
పురాణాల్లో కన్యాదానానికి ఉన్న విలువ అసామాన్యం. కన్యాదానం చేసిన వారికి వంద జన్మల పుణ్యఫలం దక్కుతుందని అంటుంటారు. అందుకే దానం ఇచ్చే వాళ్లకు పెళ్లిలో ప్రాధాన్యత ఉంటుంది. దానం పుచ్చుకునేవాళ్లకు గర్వంగా ఫీలయ్యే హక్కు ఎంతమాత్రం ఉండదు. దానం ఇచ్చే వాడి మీద అయినదానికీ కానిదానికీ అరవాడనికి, విసుక్కోవడానికి వాళ్లకు అసలు అర్హతే లేదని వేద పండితులు చెప్తున్నారు. దానం పుచ్చుకునేవాడికి ఆర్డర్స్ వేసి చేయించుకునే అధికారం అసలు ఏ మాత్రం లేదు.
దానం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుట్టుకోవడం మాత్రమే చేయాల్సిన పని. రామాయణంలో కూడా జనక మహారాజు తన కుమార్తె సీతను కన్య దానం చేసేటప్పుడు దశరథ మహారాజు తన కొడుకు రామచంద్రమూర్తి పరాక్రమం, గుణగణాలు తెలిసినా కూడా తన మర్యాదలో, తన హద్దులో తాను ఒదిగి ఉన్నాడని నానుడి.

అందుకే కన్యాదాత తనకు ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి వరుడికి కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవాడికి దాతతో ఎలా ఏర్పాట్లు చేయాలో చెప్పడానికి ఎటువంటి అధికారం ఉండదు. కట్నాలు, కానుకలు, పెళ్ళి వాళ్ళ కేకలు, అరుపులు, అత్తవారి చీవాట్లు, ఆడపడుచుల దబాయింపులు, ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు అని చెప్పడంలో ఎలాంటి మొహమాటం లేదు. ఒక ఇంటి మర్యాద ఏంటి అనేది వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగిన రోజు తెలిసిపోతుందని కూడా పండితులు సూచిస్తున్నారు.
Also Read: కేసీఆర్‌పై ఆప్ నేత సంచలన కామెంట్స్.. సడెన్ గా ఏంటీ పరిణామం