https://oktelugu.com/

Pakka Commercial: పక్కా కమర్షియల్ మూవీ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు వసూలు చెయ్యాలో తెలుసా?

Pakka Commercial: వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న టాలీవుడ్ కి ఇటీవల కాలం లో విడుదలైన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టి కాస్త నష్టం చేసాయి..అంటే సుందరానికి సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికి కూడా బయ్యర్స్ కి భారీ నష్టాలను మిగిలించింది..ఇక ఆ సినిమా తర్వాత విడుదలైన చిన్న సినిమాలు కనీస స్థాయి వసూళ్లను కూడా దక్కించుకోలేకపోయ్యాయి..దీనితో భారీ నష్టాలను మూటగట్టుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2022 / 03:35 PM IST
    Follow us on

    Pakka Commercial: వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న టాలీవుడ్ కి ఇటీవల కాలం లో విడుదలైన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టి కాస్త నష్టం చేసాయి..అంటే సుందరానికి సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికి కూడా బయ్యర్స్ కి భారీ నష్టాలను మిగిలించింది..ఇక ఆ సినిమా తర్వాత విడుదలైన చిన్న సినిమాలు కనీస స్థాయి వసూళ్లను కూడా దక్కించుకోలేకపోయ్యాయి..దీనితో భారీ నష్టాలను మూటగట్టుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు గోపీచంద్ హీరో గా నటించిన పక్కా కమర్షియల్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది..ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం తో సినిమా పై అంచనాలు పెరిగాయి..పైగా లౌక్యం వంటి కామెడీ ఎంటర్టైనర్ తర్వాత గోపీచంద్ బాగా గ్యాప్ తీసుకొని మరో కామెడీ ఎంటర్టైనర్ చెయ్యడం..దానికి మారుతి వంటి డైరెక్టర్ దర్శకత్వం వహించడం తో పాటు గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి ఈ సినిమా విడుదల అవ్వబోతుండడం తో ట్రేడ్ లో ఈ మూవీ కి డిమాండ్ పీక్స్ లో ఉంది అనే చెప్పొచ్చు.

    Gopichand

    Also Read: Revanth Reddy- Bhatti Vikramarka: రేవంత్ కాళ్లల్లో భట్టి కట్టెలు కాంగ్రెస్ లోకి నేతలు చేరకుండా అడ్డు పుల్లలు

    రెండు తెలుగు రాష్ట్రాలలో సాధారణ టికెట్ రేట్స్ కి అమ్ముడుపోయిన ఈ చిత్రం ఆంధ్ర ప్రాంతం లో దాదాపుగా 9 కోట్ల రూపాయిల రేషియో లో బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది..ఇది గోపీచంద్ కెరీర్ లో ఇటీవల కాలం లో హైయెస్ట్ బిజినెస్ అని చెప్పొచ్చు..ఈ ప్రాంతం లో ఈ సినిమా హిట్ అవ్వాలంటే పది కోట్లకు పైగా షేర్ ని రాబట్టాలి..ఇక రాయలసీమ ప్రాంతం లో కూడా ఈ సినిమా కి మంచి బిజినెస్ జరిగింది అనే చెప్పాలి..ఇక్కడ ఈ సినిమాకి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది..ఇటీవల కాలం లో సీడెడ్ ప్రాంతం లో కమర్షియల్ ఎంటెర్టైనెర్స్ అద్భుతమైన వసూళ్లు రాబట్టడం తో పక్క కమర్షియల్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మూడు రోజుల్లో ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి వస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా..ఇక తెలంగాణ ప్రాంతం లో ఈ సినిమాకి దాదాపుగా 7 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 21 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతాలకు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 25 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం..అంటే ఈ సినిమా సూపర్ హిట్ స్టేటస్ ని పొందాలంటే 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించాల్సిన అవసరం ఉంది..చూడాలి మరి ఈ సినిమా 30 కోట్లకి పైగా షేర్ ని వసూలు గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందా లేదా అనేది.

    Gopi Chand, Rashi Khanna

    Also Read: Rajamouli- Mahesh Babu: మహేష్ టెన్షన్.. కారణం రాజమౌళి సినిమానే

    Tags