
కరోనా మహమ్మరి దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించాలని కేంద్రం నడుం బిగించింది. భారత దేశ చరిత్రలోనే అథమంగా జీడీపీ -23.9 కు దిగజారడం.. దేశవ్యాప్తంగా ఐదునెలల్లోనే కోటిన్నర మంది ఉద్యోగాలు కోల్పోవడం.. పేదలకు పనిలేని పరిస్థితుల్లో తాజాగా సమావేశమైన కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది.
జాతీయ ఉపాధి హామీ పథకం ఇన్నాళ్లు గ్రామీణ ప్రాంతాల్లోనే అమలవుతోంది. ఇప్పుడు పట్టణాలకు విస్తరించాలని.. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి కల్పన పథకంగా మార్చాలని యోచిస్తోంది. లాక్ డౌన్ తో చితికిపోయిన పట్టణ పేదలను ఆదుకోవాలని కేంద్రం యోచిస్తోంది.
ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక దేశమంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒకే పరీక్ష నిర్వహించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి ‘కర్మయోగి యోజన’ అనే పేరు పెట్టారు.
ఇక జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లును కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అధికార భాషలుగా ఉర్దూ, కశ్మీర్, డోగ్రీ, హిందీ, ఇంగ్లీస్ భాలున్నాయి.
ఈ సమావేశంలో సివిల్ సర్వీసెస్ ను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రధాని పర్యవేక్షణలోనే సివిల్ సర్వీసెస్ పనిచేయనుంది.