https://oktelugu.com/

ఒకే ఒక్క దెబ్బతో బాబు కుల రాజకీయం బట్టబయలు…?

అవకాశవాద రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ఎప్పుడూ ముందు ఉంటారన్నది దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తూ ఉన్న మాట. ఇక కుల రాజకీయాలు చేసే వారిని, టిడిపి పార్టీ సభ్యులను  విడివిడిగా చూడలేం అన్నది కూడా ఎప్పటినుండో ఉన్న ఆ విమర్శ. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు వేసిన ఒకే ఒక్క తప్పటడుగు అతని ఆలోచన తీరును, అవసరాన్ని, కుల రాజకీయతత్వాన్ని బయటపడేలా చేసింది. Also Read : ట్విస్ట్: వదలని జగన్.. మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ వివరాల్లోకి వెళితే […]

Written By: , Updated On : September 2, 2020 / 06:36 PM IST
Did Chandrababu lose hope in that area ...?
Follow us on

N Chandrababu Naidu seeks Governor's intervention to restore law and order, democracy - The Economic Times

అవకాశవాద రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ఎప్పుడూ ముందు ఉంటారన్నది దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తూ ఉన్న మాట. ఇక కుల రాజకీయాలు చేసే వారిని, టిడిపి పార్టీ సభ్యులను  విడివిడిగా చూడలేం అన్నది కూడా ఎప్పటినుండో ఉన్న ఆ విమర్శ. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు వేసిన ఒకే ఒక్క తప్పటడుగు అతని ఆలోచన తీరును, అవసరాన్ని, కుల రాజకీయతత్వాన్ని బయటపడేలా చేసింది.

Also Read : ట్విస్ట్: వదలని జగన్.. మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ

వివరాల్లోకి వెళితే చాలా రోజుల బ్రేక్ తర్వాత హైదరాబాద్ నుండి తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ లోని తన ఇంటి నుండి బయలుదేరి సాయంత్రం ఉండవల్లి లోని తన ఇంటికి చేరుకుంటారని టీడీపీ వర్గాలు చెప్పాయి. ఇక గురువారం నాడు బాబు…. బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర బాబు లని కలిసి పరామర్శించనున్నారని చెబుతున్నారు. పార్టీ అధినేతగా కష్టాల్లో ఉన్న నేతలను పరామర్శించి ధైర్యం చెప్పడం సబబు. అది ఇతర నాయకులకు కూడా భరోసా ఇచ్చినట్లు ఉంటుంది. అయితే ఇదే సమయంలో వారితో పాటుగా రెండు సార్లు జైలుకి వెళ్ళిన జేసీ ప్రభాకర్ రెడ్డిని మాత్రం బాబు అతను ఎందుకు కలవట్లేదు అని ఇప్పుడు సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.

అటు జేసీ అభిమానులు ఏమో…. తమ నాయకుడు రెండు సార్లు జైలు పాలయ్యారని…. మొదటిసారి అరెస్టయినప్పుడు లోకేష్ వచ్చి పరామర్శించారు అని గుర్తు చేస్తున్నారు. అంటే మిగతా ఇద్దరు మాజీ మంత్రుల స్థాయి చంద్రబాబు వచ్చి పరామర్శించేంత అయితే జేసీకి లోకేష్ బాబు పరామర్శలతో సరి పెట్టేశారా అన్నది వారి ప్రశ్న. లాజికల్ గా చూసుకుంటే జెసి బ్రదర్స్ పైన బాబుకి నిజంగా ప్రేమ ఉంటే…. రెండుసార్లు అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు చంద్రబాబు నేరుగా తాడిపత్రి పోయి ఉండాల్సింది. 

అయితే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర బీసీలు కావడంతో వారిని పరామర్శించి కుల రాజకీయాలు చేయడానికి ఇదే సరైన సమయమని చంద్రబాబు ఆంధ్రకి వస్తున్నారనన్న విమర్శలు కూడా లేకపోలేదు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించడం వల్ల తనకు ఒరిగేది ఏమీ లేదని చంద్రబాబు భావిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఇది విన్న తర్వాత అయినా బాబు జేసి ని పరామర్శించేందుకు వెళ్తారా…? అనుమానమే..

Also Read : పవర్ ఉన్న వాళ్ళని జగన్ పట్టించుకోరా..?