Homeజాతీయ వార్తలుViksit bharat- Budget 2024 : వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు.. కేంద్ర బడ్జెట్ పై...

Viksit bharat- Budget 2024 : వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు.. కేంద్ర బడ్జెట్ పై పెరిగిన ఆసక్తి

Viksit bharat- Budget 2024  : కేంద్రంలో మూడోసారి గెలిచి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సారథ్యంలో ప్రధాని మోదీ సర్కారు బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమవుతున్నది. గతంలోనే వికసిత్ భారత్ ను లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యేనాటికి, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని భావిస్తున్నది. ఇప్పటికే ఆ దిశగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నెల 23న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో ఆ దిశగా కేటాయింపులు ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. గత రెండు పర్యాయాలతో పోలిస్తే మోదీ 3.0 సర్కారుకు పార్లమెంట్లో సంఖ్యాబలం తగ్గింది. ఈ క్రమంలోనే ఆర్థిక సమీక్ష చేస్తూనే ప్రజాకర్షక పథకాలకు కేటాయింపులు చేసే అవకాశం ఉందని రాజకీయ, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 2024-25 సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇక భవిష్యత్ అవసరాలకు ప్రాధాన్యమిస్తూ పూర్తిస్థాయి బడ్జెట ను ఈ నెల న ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఏడో సారి ఈ బడ్జెన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక పీఎం మోదీ పదే పదే చెబుతున్నట్లుగా వికసిత్ భారత్ వైపు ఈ బడ్జెట్ చూపు ఉంటుందని నిపుణులు అభిప్రాయ పాడుతున్నారు. గ్రామీణాభివృద్ధి, రక్షణరంగానికి కేటాయింపులు, ఆరోగ్యవసతులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తారని భావిస్తున్నారు.

మౌలిక వసతుల కల్పనపై దృష్టి
మోదీ 2.0 సర్కారు గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చింది. రూ.11.11 లక్షల కోట్లు మూల ధన పెట్టుడులకు కేటాయించింది. గతంతో పోలిస్తే అది ఏకంగా 11 శాతం అధికం. పూర్థిస్థాయి బడ్జెట్ లో ఇది మరింత పెరగనుంది. ముఖ్యంగా రహదారులు, రైల్వే, గృహనిర్మాణ రంగాలకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. కీలక ప్రాజెక్టుల పూర్తి తో పాటు పర్యావరణ హిత విధానాలకు పెద్దపీట వేయడం, ప్రైవేట్ ను ప్రోత్సహిస్తూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలి.

అన్నదాలను ఆకర్షిస్తారా..?
ప్రధాన పంటల మద్దతు ధరల పెంపుపై రైతులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. సాగుతో పాటు నిల్వ, ఆహార శుద్ధి రంగాలకు బడ్జెట్ లో ప్రాధాన్యమివ్వాలి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ని పెంచుతారని కూడా రైతాంగం ఆశలు పెట్టుకుంది.

రక్షణ రంగానికి కేటాంపులు పెరిగేనా..?
కేంద్రం గత ఫిబ్రవరిలో పెట్టిన మధ్యంతర బడ్జెట్ లో రక్షణ రంగానికి రూ. 6.21 లక్షల కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది కొంత అధికమే. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కేంద్రం ఈసారి కూడా రక్షణ రంగానికి కేటాంపులు పెంచనుంది.

తయారీ రంగంపై దృష్టి కేంద్రీకరణ
దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తున్నది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా నిర్ణయాలు ఉండొచ్చు. ఇందుకోసం రూ. 10 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాకాలను మరిన్ని రంగాలకు కేటాయించే అవకాశం ఉంది.

వేతన జీవుల ఆశలు ఫలించేలా..
వేతన జీవులు ఆదాయపు పన్ను ఊరట కోసం ఎదురు చూస్తున్నారు. రూ. 10 లక్షల లోపు ఆదాయమున్న వర్గాలకు కొంత ఊరట కలిగించే అవకాశమున్నట్లుగా తెలుస్తున్నది. ఇక ప్రభుత్వం ఈ సారి పన్ను రేట్లను తగ్గిస్తుందని, రూ. 5 లక్షలలోపు ఆదాయమున్న వారికి గుడ్ న్యూస్ చెప్పబోతున్నదని వార్తలు వస్తున్నాయి.

సామాజిక, వైద్యరంగానికి ఊతం
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిపెట్టబోతున్నది. రహదారుల నిర్మాణం, ప్రజారోగ్యం, బీమా, మహిళలకు ఆర్థిక సాధికారత, ఉద్యోగాల కల్పన వంటి వాటికి కొంత కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version