
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి.. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు మధ్య వివాదం ముదురుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ లో జరుగుతున్న క్యాంపెయిన్ ను నిలువరిచండంలో ట్విట్టర్ ఉదాసీనత కేంద్రానికి ఆగ్రహం తెప్పింది. అందుకే కొత్త సోషల్ మీడియా నిబంధనలను దేశంలో ప్రవేశపెట్టి మే నెలలోపు అమలు చేయాలని అన్ని సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చింది. మే 26లోపు అమలు చేయాలని ఆదేశించింది.
కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం దేశంలో ట్విట్టర్ సహా అన్ని సంస్థలు బాధ్యులైన చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్ ను నియమించాల్సి ఉంటుంది. అంతేకాదు.. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాట్రాక్ట్ అధికారులను భారత్ కు చెందిన వ్యక్తులను నియమించాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ట్విట్టర్ మాత్రం ఈ అధికారులను నియమించలేదు. దీంతో కేంద్రం ఆగ్రహించింది.
కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చి వారం గడిచినా ట్విట్టర్ ఇంకా వీటిని పాటించేందుకు విముఖత చూపిస్తోందని కేంద్రం ఆరోపిస్తోంది. కేంద్ర ఐటీ శాఖ తాజాగా నేడు ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. ఇదే చివరి నోటీసు అని.. నిబంధనలు పాటించక పోతే తక్షణమే ట్విట్టర్ తన మధ్యవర్తిత్వ హోదాను కోల్పోవాల్సి వస్తుందని కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ట్విట్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
దీంతో కేంద్రప్రభుత్వం దేశంలో ట్విట్టర్ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ట్విట్టర్ చేస్తున్న పనులు కేంద్రానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య అకౌంట్ ను వెరిఫైడ్ అకౌంట్ కాదంటూ తీసేసి మళ్లీ యాడ్ చేయడం దుమారం రేపింది. దీంతో వెంటనే ట్విట్టర్ కు కేంద్రం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.