https://oktelugu.com/

KCR vs Central Govt: కేసీఆర్ ధర్నా చేసినా వడ్లు కొనమన్న కేంద్రం.. గట్టి షాక్ ఇచ్చిందే..

KCR vs Central Govt:వడ్లు కొంటారా? కొనరా అంటూ హైదరాబాద్ ఇందిరా చౌక్ వద్ద ధర్నా చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రం షాకిచ్చింది. ఆయన ధర్నాకు స్పందించింది. అదే సమయంలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ సాగవుతున్న ధాన్యంను కొనే అవకాశం లేదని కుండబద్దలు కొట్టింది. దేశవ్యాప్తంగా సాగవుతున్న వరి, గోధుమలు అవసరాలకు సరిపడే కంటే ఎక్కువే ఉన్నాయని.. పంజాబ్ లో తక్కువకు దొరుకుతుండడంతో అక్కడే 90శాతాన్ని కేంద్రం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2021 / 04:07 PM IST
    Follow us on

    KCR vs Central Govt:వడ్లు కొంటారా? కొనరా అంటూ హైదరాబాద్ ఇందిరా చౌక్ వద్ద ధర్నా చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రం షాకిచ్చింది. ఆయన ధర్నాకు స్పందించింది. అదే సమయంలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ సాగవుతున్న ధాన్యంను కొనే అవకాశం లేదని కుండబద్దలు కొట్టింది.

    Modi KCR

    దేశవ్యాప్తంగా సాగవుతున్న వరి, గోధుమలు అవసరాలకు సరిపడే కంటే ఎక్కువే ఉన్నాయని.. పంజాబ్ లో తక్కువకు దొరుకుతుండడంతో అక్కడే 90శాతాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలోనే పంజాబ్ కు పెద్దపీట వేస్తోంది.

    అయితే తెలంగాణలో ప్రాజెక్టులతో సస్యశ్యామలం అయ్యింది. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల.. ఇతర పథకాలతో భూగర్భ జలాల సాగు విపరీతంగా పెరిగింది. దీంతో రైతుల సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా వరి పంట దిగుబడి బాగా అయ్యింది.

    ఈ పంటను కేంద్రమే కొనాల్సి ఉంటుంది. ఎఫ్.సీఐ, ఐకేపీల ద్వారా కేంద్రం సేకరించాలి. తెలంగాణ దేశానికే సీడ్ బౌల్ గా మారి అత్యధిక మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించడంతో ఆ పంట అంతా పేరుకుపోతోంది. కల్లాలు, సెంటర్లలో కుప్పలుగా మిగిలిపోతోంది.

    ఈ క్రమంలోనే తెలంగాణ వడ్లు కొంటారా? కొనరా చెప్పాలని 48 గంటల ధర్నా చేపట్టారు కేసీఆర్. ఈ ధర్నా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక సీఎం కేంద్రంపై పోరాడడానికి ధర్నా చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి కేంద్రం తాజాగా స్పందించింది.

    పారా బాయిల్డ్ రైస్ ను తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. యాసంగి పంట ధాన్యం కూడా పరిమితంగానే కొంటామని షాక్ ఇచ్చింది. రబీ పంట సేకరణకు రాష్ట్రాలతో చర్చించాకే ఎంత కొంటామన్నది చెబుతున్నామన్నారు. వరి, గోధుమ పంటలను తక్కువ పండించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపింది. ప్రత్యామ్మాయ పంటల వైపు వెళ్లాలని సూచించింది. తెలంగాణలో పండించే బాయిల్డ్ రైస్ కేంద్రం కొనదని కుండబద్దలు కొట్టింది.  దీంతో కేసీఆర్ ఇంత ధర్నా చేసినా కేంద్రం పెడచెవిన పెట్టి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.