https://oktelugu.com/

2 వేల నోట్లపై కేంద్రం క్లారిటీ..

2000 కరెన్సీ ఎప్పటి నుంచో మార్కెట్లో పెద్దగా కనిపించడం లేదు. ఏ ఎటీఎంలోనూ.. ఏ బ్యాంకుల్లోనూ ఈ నోటు చెలామణి కావడం లేదు. అయితే. 2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆపేశారని ఆ మధ్య పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ ఊహాగానాలకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. లోక్‌సభ వేదికగా అనుమానాలకు తెరదించింది. Also Read: అనూహ్యంగా మలుపుతిరిగిన అమెరికా ఎన్నికలు కరెన్సీ నోట్ల ముద్రణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రజల లావాదేవీల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని […]

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2020 / 09:02 AM IST
    Follow us on


    2000 కరెన్సీ ఎప్పటి నుంచో మార్కెట్లో పెద్దగా కనిపించడం లేదు. ఏ ఎటీఎంలోనూ.. ఏ బ్యాంకుల్లోనూ ఈ నోటు చెలామణి కావడం లేదు. అయితే. 2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆపేశారని ఆ మధ్య పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ ఊహాగానాలకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. లోక్‌సభ వేదికగా అనుమానాలకు తెరదించింది.

    Also Read: అనూహ్యంగా మలుపుతిరిగిన అమెరికా ఎన్నికలు

    కరెన్సీ నోట్ల ముద్రణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రజల లావాదేవీల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐతో చర్చిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌‌ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. 2019–20, 2020–21 సంవత్సరాల్లో రూ.2000 డినామినేషన్‌ నోట్ల ముద్రణ కోసం ప్రెస్‌లతో ఎటువంటి ఇండెంట్‌ ఉంచలేదని ఆయన తెలిపారు.

    మార్చి 31, 2019 నాటికి 32,910 లక్షల నోట్లతో పోలిచతే 2020 మార్చి 31 నాటికి 27,938 లక్షల రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా.. 2019–20లో రూ.2000 కరెన్సీ నోట్లను అసలు ఒక్క నోటును కూడా ముద్రించలేదని ఆర్‌‌బీఐ వార్షిక నివేదికలో పేర్కొంది. కొన్నేళ్లుగా 2 వేల నోట్ల సర్క్యులేషన్‌ కూడా బాగా తగ్గిందని నివేదికలో చెప్పింది. వీటన్నింటి నేపథ్యంలో కేంద్రం ఇక రూ.2 వేల నోట్ల ముద్రణ ఆపేసిందనే వార్తలు వచ్చాయి. తాజాగా స్పందించిన ప్రభుత్వం ఆ వార్తలను కొట్టిపారేసింది.

    Also Read: రైతుల కోసం మోడీతో ఢీకొంటున్న కేసీఆర్

    2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ 2 వేల నోటును తీసుకొచ్చింది. ఆ తర్వాత మూడేళ్లపాటు బాగానే సర్క్యులేట్‌ అయినా.. ఆ తర్వాత  ఈ పెద్ద నోటు అంతగా కనిపించలేదు. కొందరు బడా వ్యాపారులే ఈ నోట్లను బ్లాక్‌ మనీగా దాచి పెట్టారనే ప్రచారం కూడా నడుస్తోంది.