https://oktelugu.com/

హైదరాబాద్ లో సెలబ్రిటీలకు షాక్.. వాట్సాప్ చాట్ హ్యాక్

కాదేది హ్యాకింగ్ కు అనర్హం అన్నట్టుగా మారింది. టెక్నాలజీ పెరగడంతో కొత్త కొత్త మోసాలు వెలుగుచూస్తున్నారు. సైబర్ నేరగాళ్లు బాగా డబ్బున్న వారిని..ప్రముఖులను టార్గెట్ చేసి వారి వాట్సాప్ హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న వైనం వెలుగుచూసింది. Also Read: అగ్రి గోల్డ్ బాధితులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..? తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖుల వాట్సాప్ హ్యాక్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో మూడు కమిషనర్ల […]

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2020 / 01:32 PM IST

    WhatsApp

    Follow us on


    కాదేది హ్యాకింగ్ కు అనర్హం అన్నట్టుగా మారింది. టెక్నాలజీ పెరగడంతో కొత్త కొత్త మోసాలు వెలుగుచూస్తున్నారు. సైబర్ నేరగాళ్లు బాగా డబ్బున్న వారిని..ప్రముఖులను టార్గెట్ చేసి వారి వాట్సాప్ హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న వైనం వెలుగుచూసింది.

    Also Read: అగ్రి గోల్డ్ బాధితులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

    తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖుల వాట్సాప్ హ్యాక్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో మూడు కమిషనర్ల పరిధిలోనూ ఇలాంటి మోసాలు జరిగినట్టు వెలుగుచూసింది.

    హైదరాబాద్ లో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీల వాట్సాప్ చాట్ హ్యాక్ అయ్యింది. ఎమర్జెన్సీ మెసేజ్ ల పేరుతో సైబర్ కేటుగాళ్లు వాట్సాప్ మెసేజ్ లు చేస్తున్నారు. ఆరు డిజిట్ల కోడ్ తో ఎస్ఎంఎస్ లు పంపుతున్నారు. ఓటీపీ నెంబర్ పంపాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఓటీపీ నెంబర్ చెప్పగానే వాట్సాప్ హ్యాక్ అవుతోంది.

    హైదరాబాద్ లో జరిగిన ఈ సైబర్ హ్యాక్  బాధితుల్లో పలువురు సెలబ్రిటీలు, డాక్టర్లు ఉన్నట్టు సమాచారం. వాట్సప్ లో వచ్చే కోడ్ మెసేజ్ లను ఎవరికి పంపవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఈ హ్యాక్ లో డాక్టర్లు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది.

    Also Read: చైనాలో మరో కొత్త వైరస్.. మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందా..?

    హెల్త్ ఎమర్జెన్సీ పేరుతో వారికి ఒక కోడ్ పంపుతారు. ఆ కోడ్ క్లిక్ చేయగానే వారి వాట్సాప్ హ్యాక్ అవుతోంది. వాట్సాప్ కు వచ్చే మెసేజ్ లను క్లిక్ చేయడం.. కానీ ఫార్వర్డ్ చేయడం కానీ చేయవద్దని పోలీసులు కోరుతున్నారు.