https://oktelugu.com/

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సెట్ లో కరోనా !

నేషనల్ స్టార్ ప్రభాస్ తన ‘రాధే శ్యామ్’ కోసం గత వారం నుండి షూట్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయిలు పెట్టి నిర్మించిన భారీ హాస్పిటల్ సెట్‌ లో షూట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ను ఆపేసినట్లు తెలుస్తోంది. కెమెరా డిపార్ట్మెంట్ కి సంబంధించిన అపరేటివ్ కెమెరామెన్ కి కరోనా లక్షణాలు కనిపించడంతో ప్రస్తుతం షూట్ […]

Written By:
  • admin
  • , Updated On : September 29, 2020 / 01:56 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ ప్రభాస్ తన ‘రాధే శ్యామ్’ కోసం గత వారం నుండి షూట్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయిలు పెట్టి నిర్మించిన భారీ హాస్పిటల్ సెట్‌ లో షూట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ను ఆపేసినట్లు తెలుస్తోంది. కెమెరా డిపార్ట్మెంట్ కి సంబంధించిన అపరేటివ్ కెమెరామెన్ కి కరోనా లక్షణాలు కనిపించడంతో ప్రస్తుతం షూట్ కి బ్రేక్ ఇచ్చారట. ఇప్పుడు ఇదే సెట్ లో షూట్ చేయడం రిస్క్ అని షూట్ క్యాన్సల్ చేశారట. ఈ షెడ్యూల్ లో దాదాపు పది రోజుల పాటు ఇతర ఆర్టిస్ట్ ల పై షూట్ జరగనుందని.. ఎక్కువుగా సీనియర్ ఆర్టిస్ట్ లు ఉండటంతో చిత్రబృందం ముందు జాగ్రత్త చర్యలను కాస్త కఠినంగా తీసుకుంటుందని తెలుస్తోంది.

    Also Read: ఉచితంగా ప్లాస్మా.. మెగాస్టార్ నిజంగా దేవుడే !

    కాగా ఈ షెడ్యూల్ లోనే ప్రభాస్ పై కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారని, ఈ సీన్స్ లో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని.. అందుకే ప్రభాస్ లుక్ కూడా లాంగ్ హెయిర్ తో పాటు హెవీ ఎమోషనల్ ఆర్ఆర్ తో సాగుతోందని తెలుస్తోంది. ఇక ఏ మాత్రం హిట్ అండ్ ఫేమ్ కూడా లేని రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్.. పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. అందుకే ఈ సినిమాకి దాదాపు 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ డైరెక్టర్ రాధా కృష్ణకు పెద్దగా హిట్ ట్రాక్ లేకపోవడంతో ఈ సినిమా పై ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. అయినా బడ్జెట్ విషయంలో మాత్రం ఈ సినిమా నిర్మాతలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

    Also Read: హీరో సూర్య ఆఫీస్ లో బాంబు అంటూ కాల్.. చివరకు..?

    అయితే కాంబినేషన్ అనేది.. ఈ సినిమా మార్కెట్ కి పెద్ద సమస్యగా మారిందట. ఈ సినిమాని నాలుగు భాషల్లో మార్కెట్ చేయాలంటే డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ చాలా కీలకం.. ఈ సినిమా బిజినెస్ విషయంలో ఇప్పటికే బయ్యర్లు భారీ మొత్తం పెట్టడానికి ముందుకు రావడం లేదు. కాగా ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా తర్వాత, తన 21వ సినిమాని ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఇంకా స్టార్ట్ చేయలేదు. అప్పుడే ఈ సినిమా కోసం బయ్యర్లు పోటీ పడుతున్నారట. కానీ, ‘రాధే శ్యామ్’ మీద మాత్రం ఎవ్వరూ ఇంట్రస్ట్ చూపించడం లేదు. మరి గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రాధే శ్యామ్’ చివరకు నిర్మాతలకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తోందో చూడాలి.