CBSE Board Results 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 సంవత్సరానికి సంబంధించిన 10వ మరియు 12వ తరగతి ఫలితాలను మే రెండవ వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు సూచించారు. గత సంవత్సరం ఫలితాలు మే 13న ప్రకటించిన నేపథ్యంలో, ఈ ఏడాది కూడా ఇదే సమయంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు cbse.gov.in, results.cbse.nic.in, cbseresults.nic.in, cbseservices.digilocker.gov.in ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. అదనంగా, డిజిలాకర్ యాప్ ద్వారా డిజిటల్ మార్క్‌షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి సీబీఎస్‌ఈ 6–అంకెల యాక్సెస్ కోడ్‌ను విద్యార్థులకు అందజేసింది. ఈ ఫలితాల కోసం దాదాపు 42 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
Also Read : 75% హాజరు తప్పనిసరి, కఠిన నిబంధనలతో విద్యార్థులకు సవాల్
ఫలితాల తనిఖీ విధానం
విద్యార్థులు సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి ఫలితాలను తనిఖీ చేయడానికి క్రింది దశలను అనుసరించవచ్చు.
అధికారిక వెబ్‌సైట్ సందర్శన: cbse.gov.in, results.cbse.nic.in లేదా cbseresults.nic.in వెబ్‌సైట్‌లను ఓపెన్ చేయండి.
లాగిన్ వివరాలు: ‘CBSE Class 10 Result 2025’ లేదా ‘CBSE Class 12 Result 2025’ లింక్‌పై క్లిక్ చేసి, రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేయండి.
ఫలితం వీక్షణ: ’సబ్మిట్’ క్లిక్ చేసిన తర్వాత, ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.
డిజిలాకర్ ద్వారా తనిఖీ:
డిజిలాకర్ వెబ్‌సైట్ (digilocker.gov.in) లేదా యాప్‌ను ఓపెన్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఆధార్ వివరాలతో లాగిన్ చేయండి.
‘CBSE Results’ విభాగంలో, తగిన తరగతిని ఎంచుకుని, రోల్ నంబర్, స్కూల్ కోడ్‌ను నమోదు చేయండి.
ఫలితం మరియు డిజిటల్ మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
ఎస్‌ఎంఎస్ లేదా ఐవీఆర్‌ఎస్:
ఎస్‌ఎంఎస్ ద్వారా ఫలితం పొందడానికి, ‘CBSE10 రూల్ నంబర్, స్కూల్ నంబర్, సెంటర్ నంబర్’ లేదా ‘CBSE12 రూల్ నంబర్, స్కూల్ నంబర్, సెంటర్ నంబర్’ అని టైప్ చేసి 7738299899కి పంపండి.
ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫలితం కోసం, 24300699 నంబర్‌కు ఏరియా కోడ్‌తో కాల్ చేయండి.
డిజిలాకర్ యాక్సెస్ కోడ్
సీబీఎస్‌ఈ డిజిలాకర్ ద్వారా డిజిటల్ మార్క్‌షీట్‌లు, పాస్ సర్టిఫికెట్‌లు, మైగ్రేషన్ సర్టిఫికెట్‌లను అందజేస్తుంది. దీని కోసం.
స్కూల్స్ తమ డిజిలాకర్ ఖాతాల ద్వారా 6–అంకెల యాక్సెస్ కోడ్‌ను డౌన్‌లోడ్ చేసి, విద్యార్థులకు అందజేస్తాయి.
విద్యార్థులు cbseservices.digilocker.gov.in లో లాగిన్ చేసి, రూల్ నంబర్, స్కూల్ కోడ్, యాక్సెస్ కోడ్‌తో ఖాతాను యాక్టివేట్ చేయాలి.
యాక్టివేషన్ తర్వాత, ఛీజీజజీ digilocker.gov.in లో లాగిన్ చేసి, ‘CBSE Results’ విభాగంలో మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేయవచ్చు.
కొత్త గ్రీవెన్స్ రిడ్రెసల్ విధానం
సీబీఎస్‌ఈ ఫలితాల తర్వాత పారదర్శకత, న్యాయాన్ని నిర్ధారించేందుకు కొత్త గ్రీవెన్స్ రిడ్రెసల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం.
విద్యార్థులు మొదట తమ మూల్యాంకనం చేయబడిన సమాధాన పత్రాల ఫోటోకాపీ కోసం దరఖాస్తు చేయాలి.
ఫోటోకాపీ సమీక్షించిన తర్వాత, మార్కుల ధవీకరణ లేదా పునఃమూల్యాంకనం కోసం దరఖాస్తు చేయవచ్చు.
ఈ మార్పు విద్యార్థులకు తమ సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది, తద్వారా ఫిర్యాదులను మరింత సమర్థవంతంగా పరిష్కరించవచ్చు.
2025 పరీక్షలు మరియు ఫలితాల వివరాలు
2025 సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి మార్చి 18 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 42 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు, వీరిలో 24.12 లక్షల మంది 10వ తరగతి, 17.88 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించబడ్డాయి. 10వ తరగతిలో 84 సబ్జెక్టులు, 12వ తరగతిలో 120 సబ్జెక్టులు అందించబడ్డాయి.
ఫలితాల కోసం సీబీఎస్‌ఈ డిజిలాకర్, ఉమంగ్ యాప్, ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్ వంటి బహుళ ఛానెళ్లను ఉపయోగిస్తోంది, తద్వారా విద్యార్థులు సులభంగా తమ స్కోర్‌లను యాక్సెస్ చేయవచ్చు. గత ఏడాది, 10వ తరగతి ఉత్తీర్ణత శాతం 93.60%, 12వ తరగతి ఉత్తీర్ణత శాతం 87.98%గా నమోదైంది. ఈ సంవత్సరం, పరీక్షలు సులభం నుండి మితమైన స్థాయిలో ఉండటంతో, ఉత్తీర్ణత శాతం కొంత మెరుగుదలను చూడవచ్చని భావిస్తున్నారు.
కంపార్ట్‌మెంట్ పరీక్షలు, రీ–ఎవాల్యుయేషన్
ప్రతీ సబ్జెక్టులో కనీసం 33% మార్కులు సాధించడం ఉత్తీర్ణతకు తప్పనిసరి. ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు జూన్/జులై 2025లో నిర్వహించే కంపార్ట్‌మెంట్ పరీక్షలకు హాజరవవచ్చు. మార్కులపై సంతప్తి చెందని విద్యార్థులు రీ–ఎవాల్యుయేషన్ లేదా మార్కుల ధవీకరణ కోసం ఫలితాల ప్రకటన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త విధానం ప్రకారం, మొదట సమాధాన పత్రం ఫోటోకాపీ పొందడం తప్పనిసరి.
అదనపు సమాచారం
సీబీఎస్‌ఈ ఫలితాల ప్రకటన తర్వాత, పాస్ శాతం, టాప్ పెర్ఫార్మింగ్ రీజియన్‌లు, లింగం వారీగా విజయ శాతం వంటి వివరణాత్మక గణాంకాలను విడుదల చేస్తుంది. గత ఐదేళ్ల డేటా ప్రకారం, అమ్మాయిలు స్థిరంగా అబ్బాయిల కంటే ఎక్కువ ఉత్తీర్ణత శాతాన్ని సాధిస్తున్నారు. 2024లో, అమ్మాయిలు 12వ తరగతిలో 91.52%, అబ్బాయిలు 85.12% ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు.
సీబీఎస్‌ఈ టాపర్ జాబితాను విడుదల చేయదు, బదులుగా ఉత్తమ పనితీరు కనబరిచిన 0.1% విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్‌లను అందజేస్తుంది. అలాగే, విద్యార్థులు ఫలితాలతో సంబంధిత ఒత్తిడిని ఎదుర్కోవడానికి, సీబీఎస్‌ఈ ఉచిత టెలి–కౌన్సెలింగ్ సేవలను 1800–11–8004 నంబర్ ద్వారా అందిస్తుంది.
ఫేక్ నోటీసులపై జాగ్రత్త
మే 2, 2025 తేదీతో సోషల్ మీడియాలో ఒక నకిలీ నోటీసు చక్కర్లు కొడుతోందని సీబీఎస్‌ఈ హెచ్చరించింది. ఈ నోటీసు సీబీఎస్‌ఈ నుండి జారీ కాలేదని, ఫలితాల ప్రకటన గురించి అధికారిక సమాచారం కోసం cbse.gov.in లేదా cbseresults.nic.in ని మాత్రమే నమ్మాలని సూచించింది.
Also Read: ముందస్తుగా ఇంటర్ అడ్మిషన్లు.. ప్రైవేట్ ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందా?