CM Jagan Bail: జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై కోర్టు తీర్పు ఇదే

కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పును కోర్టు వాయిదా వేసింది.  సీబీఐ కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. జగన్ ఆస్తుల కేసులో షరతులను ఉల్లంఘించినందుకు బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు తాజాగా బెయిల్ రద్దు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఉమ్మడి ఏపీ […]

Written By: NARESH, Updated On : August 25, 2021 6:28 pm
Follow us on

కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పును కోర్టు వాయిదా వేసింది.  సీబీఐ కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. జగన్ ఆస్తుల కేసులో షరతులను ఉల్లంఘించినందుకు బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు తాజాగా బెయిల్ రద్దు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ నాడు అక్రమాస్తులు సంపాదించాడంటూ మాజీ మంత్రి శంకర్ రావు, మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ఉమ్మడి ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 2011 ఆగస్టు 10న సీబీఐ విచారణకు ఏపీ ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ జగన్ సహా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు మొత్తం 71 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. సీబీఐ ఈ కేసులో ఇప్పటికే 11 చార్జీషీట్లను దాఖలు చేసింది. ఈడీ కూడా పలు చార్జీషీట్లను వేసింది. 2012 మే నెలలో జగన్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. దాదాపు 16 నెలల పాటు జగన్ జైలు జీవితం గడిపారు.

అనంతరం ఏపీ సీఎం అయిన జగన్ ప్రస్తుతం పరిపాలిస్తున్నాడు. ఆయన పార్టీకే చెందిన నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు.. జగన్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే జగన్ ఆస్తుల కేసులో బెయిల్ షరతులను ఉల్లంఘించాడని.. సీఎంగా సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నాడని ఎంపీ రఘురామ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరాడు.

ఈ క్రమంలోనే కొద్ది నెలలుగా ఇరుపక్షాల వాదనలను కోర్టు విన్నది. కోర్టు విచక్షణ మేరకే జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ అధికారులు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో జగన్ బెయిల్ రద్దు అవుతుందా? లేదా? అన్నది తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపింది. తాజాగా సీబీఐ కోర్టు  సీఎం జగన్ బెయిల్ రద్దు పై నిర్ణయాన్ని వాయిదా వేసింది.