అన్ని రకాల నేలలలో కలబందను సాగు చేయవచ్చు. తేలికపాటి, నీరు నిల్వ ఉండే నేలలు కలబంద సాగుకు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. అన్ని వాతావరణ పరిస్ధితుల్లో కలబందను పెంచే అవకాశం అయితే ఉంటుంది. కలబందను నాటిన పది మాసాల్లో మొదటి కోత రాగా ఆ తర్వాత నాలుగు నెలలకు ఒకసారి ఆకులను సేకరించుకోవడంతో పాటు ఐదు సంవత్సరాల పాటు దిగుబడిని పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
ఎకరాకు 8,000 నుంచి 10,000 కలబంద పిలకలను నాటే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇందుకోసం పశువుల ఎరువును మాత్రమే వాడితే సరిపోతుంది. నీటి పారుదల ఉంటే ఎక్కువ దిగుబడిని పొందే అవకాశాలు ఉంటాయి. ఉదయం, సాయంత్రం సమయంలో మాత్రమే కలబంద మొక్క ఆకులను తీసుకోవచ్చు. ఆకులతోపాటు పిలకలను అమ్మడం ద్వారా రైతులకు ఎక్కువగా ఆదాయం వస్తుంది.
కేవలం 50,000 పెట్టుబడితో 10 లక్షల రూపాయల వరకు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఆయుర్వేదం, ఫేస్ క్రీమ్స్ లో కలబందను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నవాటిలో కలబంద ఒకటని చెప్పవచ్చు.