రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై గతంలో సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ సీఎం హోదాలో తన కేసుల్లో ఉన్న సహ నిందితులు, సాక్ష్యాలను ప్రభావితం చేసేలాగా చూస్తున్నారని ఆయన బెయిల్ ను రద్దు చేయాలని రఘురామకృష్ణ రాజు పిటిషన్ వేశారు. దీంతో పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు చేపట్టింది. నోటీసులు జారీ చేసింది. సుమారుగా పది రోజుల సమయం ఇచ్చినప్పటికీ సీబీఐ, జగన్ కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో రెండు పార్టీలు కూడా కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీబీఐ కోర్టును కోరాయి. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు విచారణను వాయిదా వేసింది.
విచారణకు సహకరించని జగన్
సీఎం వైఎస్ జగన్ ఎప్పడు కూడా సీబీఐకి సహకరించలేదు. విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో సీబీఐ వాదనపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. జగన్ మోహన్ రెడ్డి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ పలు దఫాలుగా హైకోర్టులోనే తన వాణి వినిపించింది. దీంతో జగన్ బెయిల్ వ్యవహారంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సీబీఐ వేసే కౌంటర్ పైనే అందరికీ ఆసక్తి కలుగుతోంది.
షరతులు ఉల్లంఘించలేదు
బెయిల్ పిటిషన్ కోసం షరతులు ఉల్లంఘించలేదని జగన్ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలుకు వ్యవధి కావాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో విచారణ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. పది రోజుల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని జగన్ తరఫు న్యాయవాదులు అనుకున్న ప్రకారమే గడువు కావాలని అడిగి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలేం జరుగుతోంది
ఏపీలో సీఎం జగన్ పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయనపై పలు కేసులు సీబీఐ పరిధిలో ఉన్నాయి. దీంతో ఆయన కేసుల విషయంలో ఎప్పుడూ సమయం కావాలని అడుగుతుండడంతో కేసుల విచారణలో ఆలస్యం జరుగుతోంది. అవినీతి, అక్రమాల కేసుల్లో ఎక్కువ గడువులు అడుగుతుండడంతో కేసులు కొలిక్కి రాకుండా పెండింగులోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కేసుల గోల ఎప్పటికీ తీరేనో అని ఎదురుచూస్తున్నారు.