
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈసారి పశ్చిమబెంగాల్ ఎన్నికలను పూర్తిస్థాయిలో టార్గెట్ చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సారి పశ్చిమ బెంగాల్‌లో కాషాయం జెండా ఎగురవేయాలని దృఢ సంకల్పంతో ఉంది. నాలుగైదేళ్ల కాలంలో అనేక కేసులతో తృణమూల్ కాంగ్రెస్ నేతల్ని భయపెట్టిన సీబీఐ.. ఎన్నికల ముందు వచ్చే సరికి.. వారందర్నీ బీజేపీలో చేరేలా చేయడంలో సక్సెస్ అయింది. శారదా చిట్స్ సహా అనేకానేక కేసుల్లో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వారు ఇప్పుడు కమలం నీడలో సేదతీరుతున్నారు. వారి విషయంలో బీజేపీ యూటర్న్ తీసుకుంది.
Also Read: ఏపీలో పంచాయతీ పోరు సక్సెస్..‘నిమ్మగడ్డ’ గెలిచినట్లేనా..?
అందుకే ఇప్పుడు సీబీఐ మాత్రం ఆగడం లేదు. బీజేపీలో చేరిన వారిని వదిలేసి.. ఇతర టార్గెట్లపై దృష్టి పెట్టింది. తాజాగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు ఆయన భార్యకు నోటీసులు జారీ చేసింది. కోల్‌కతాలోని అభిషేక్ బెనర్జీ ఇంటికి వెళ్లిన సీబీఐ బృందం, కోల్ స్కామ్ కేసులో దర్యాప్తుకు సహకరించాలని ఆయన భార్య రుజిరా బెనర్జీకి నోటీసులు ఇచ్చింది. ముందుగానే ఆమెకు సమన్లు జారీ చేసి సీబీఐ ఆఫీసుకు పిలిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది.
బొగ్గు గనుల్లో అవకతవకలు జరిగాయని మూడు నెలల కిందటే సీబీఐ కేసు నమోదు చేసి తృణమూల్ నేతలపై గురి పెట్టింది. తమను భయపెట్టడానికి బీజేపీ సీబీఐని వాడుకుంటుంటోందని మండిపడుతోంది. ఇప్పటికే సీబీఐని బీజేపీ మిత్రపక్షంగా విపక్ష పార్టీలు సెటైర్లు వేస్తుంటాయి. రెండు రోజుల కిందట అభిషేక్ బెనర్జీ .. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై దాఖలు చేసిన ఓ పరువు నష్టం కేసులో హాజరు కావాలని కోర్టు షాను ఆదేశించింది.
Also Read: ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. కొత్త పద్ధతిలో పరీక్షలు..?
అయితే.. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారని అభిషేక్ బెనర్జీ అమిత్ షాపై పిటిషన్ వేశారు. బెంగాల్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు అమిత్ షాకు సమన్లు చేసిన మరుసటి రోజే సీబీఐ అభిషేక్ బెనర్జీకి నోటీసులు జారీ చేసింది. ఇదే క్రమంలో ఇప్పుడు సీబీఐని పావుగా వాడుతోంది బీజేపీ. దేశంలో ఎక్కడ గెలవాలనుకుంటే అక్కడ బీజేపీ ముందుగా సీబీఐని పంపుతోంది. అక్కడ ఉన్న పార్టీలను.. నేతలపై సీబీఐ రెయిడ్ చేస్తోంది. దాంతో వారు బీజేపీలో చేరిపోతున్నారు. ఫలితంగా బీజేపీ బలం పుంజుకుంటోంది. వారు చేసిన నేరాలన్నీ మరుగున పడిపోతున్నాయి. ఇలా ఏపీ నుంచి బెంగాల్ వరకూ ఇదే రాజకీయం నడుస్తోంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Comments are closed.