వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలైన నిందితులు ఎవరో అనేది అందిరికీ తెలిసిందే. కానీ అధికారులు మాత్రం గుర్తించడం లేదు. హత్యను ఆత్మహత్యగా నమ్మించడానికి ప్రయత్నాలు చేశారు. సాక్ష్యాలను తారుమారు చేయాలని చూశారు. నిందితులు కళ్లముందే కనిపిస్తున్నా వారిని అరెస్టు చేయడం లేదు. వారిపై ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఈ కేసులో పురోగతి కనిపించడం లేదు. సునీల్ కుమార్ యాదవ్ ను అరస్టు చేస్తే కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని భావించినా ఏం జరగలేదని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్ రావు వివేకా హత్య కేసులో కీలక ఆధారాలు అందజేసినా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీంతో కేసులో ఏ ముందడుగు పడడం లేదు. సీబీఐ దగ్గర సాక్ష్యాలు లేకపోతే తాను మళ్లీ ఇస్తానని వెంకటేశ్వర్ రావు సీబీఐకి లేఖ రాసినా పట్టించుకోలేదు. కానీ ప్రభుత్వం మాత్రం వెంకటేశ్వర్ రావుపైనే చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.
అయితే వివేకా హత్య కేసులో ఏబీ వెంకటేశ్వర్ రావు ఇచ్చిన సమాచారంతోనే కేసు తేలిపోయే అవకాశం ఉన్నా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదు. వెంకటేశ్వర్ రావు ఇచ్చే సమాచారం సరిపోదా? కావాలంటే ఆయన ఇచ్చిన సమాచారంతో కేసును పరిష్కరించే అవకాశం లేదా? కానీ సీబీఐ మాత్రం ఆయన ఇచ్చే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సీబీఐ ఇంకా ఎన్ని రోజులకు పరిష్కరిస్తుందో తేలాల్సి ఉంది.