Homeఆంధ్రప్రదేశ్‌Minor Girl Raped: బాలికతో ప్రేమాయణం.. ఆపై లాడ్జిలో అత్యాచారం.. ట్విస్ట్ ఇదే

Minor Girl Raped: బాలికతో ప్రేమాయణం.. ఆపై లాడ్జిలో అత్యాచారం.. ట్విస్ట్ ఇదే

Minor girl raped

Dwaraka Tirumala, Minor Girl Raped: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బాలికలపై (Minor Girls)ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చట్టాలెన్ని తెచ్చినా అవి ప్రభావం చూపడం లేదు. ఇప్పటికే దిశ చట్టాన్ని తెచ్చినా మృగాళ్లలో భయం కనిపించడం లేదు. రోజుకో నేరం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్యోదంతం మరిచిపోకముందే మరో ఉదంతం చోటుచేసుకుంది. మహిళల రక్షణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టినా అవి వాటిని ఆపడం లేదు. ఫలితంగా విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న దాడులపై విపక్షాలు సైతం గొంతెత్తుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికను ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి(Raped) పాల్పడిన సంఘటన వెలుగుచూసింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల గుంటూరు జిల్లా రాజుపాలెంలో కూడా ఓ బాలికపై అత్యాచారం ఘటన సంచలనం సృష్టించింది.

తెలుగుదేశం పార్టీ రమ్య హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసేందుకు శ్రీకారం చుడుతోంది. రోజురోజుకు మహిళలు, బాలికలపై దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతోంది. జగన్ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలం అవుతోందని దుయ్యబట్టారు.

15 సంవత్సరాల బాలికను నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన పెయింటర్ బుద్దాల అంజిబాబుతో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నట్లు నమ్మించి పెళ్లి చేసుకుంటానని ఈనెల 19న ద్వారకా తిరుమలకు రప్పించిన అంజిబాబు అనంతరం బాలికను ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తరువాత బస్టాండ్ కు తీసుకెళ్లి విడిచిపెట్టాడు. తనకు ఇదివరకే పెళ్లి అయిందని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో అంజిబాబుపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలతో ఆటలాడుతున్న రాక్షసుల ఆగడాలు ఆగడం లేదు. నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడేలా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్లు వస్తున్నా దారుణాలు మాత్రం చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version