ఏటీఏం చోరీకి వచ్చి అవాక్కైన దొంగలు

ఎవరైనా దొంగతనాలు శ్రద్ధతో చేస్తారు. జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. కానీ ఈ దొంగలు మాత్రం ఏటీఎంను పగులగొట్టలేం అని తెలిసినా కూడా.. ఎరక్కపోయి వచ్చారు ఇరుక్కుపోయారు. సుబ్బరంగా ఏటీంలోని డబ్బును చోరీ చేద్దామనుకొని వచ్చి సీసీ టీవీ కెమెరాను బద్దలు కొట్టాయి. అయితే అక్కడే ట్విస్ట్ ఉంది. ఖమ్మం జిల్ల మధిరలో ఇద్దరు దొంగలు ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారు. అర్ధరాత్రి వేళ ఏటీఎంలో చోరీకి వెళ్లిన ఇద్దరు దొంగలు చేసిన పని నవ్వులు పూయిస్తోంది. అంతా పక్కా […]

Written By: NARESH, Updated On : June 16, 2021 3:22 pm
Follow us on

ఎవరైనా దొంగతనాలు శ్రద్ధతో చేస్తారు. జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. కానీ ఈ దొంగలు మాత్రం ఏటీఎంను పగులగొట్టలేం అని తెలిసినా కూడా.. ఎరక్కపోయి వచ్చారు ఇరుక్కుపోయారు. సుబ్బరంగా ఏటీంలోని డబ్బును చోరీ చేద్దామనుకొని వచ్చి సీసీ టీవీ కెమెరాను బద్దలు కొట్టాయి. అయితే అక్కడే ట్విస్ట్ ఉంది.

ఖమ్మం జిల్ల మధిరలో ఇద్దరు దొంగలు ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారు. అర్ధరాత్రి వేళ ఏటీఎంలో చోరీకి వెళ్లిన ఇద్దరు దొంగలు చేసిన పని నవ్వులు పూయిస్తోంది. అంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేసినా చివర్లో మాత్రం వారికి షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది.

మధిర బస్టాండ్ సమీపంలోని మెయిన్ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఓ ప్రైవేటు ఏటీఎంను చోటీ చేసేందుకు అర్ధరాత్రి వేళ ఇద్దరు దొంగలు ఏటీఎంలోకి వచ్చారు. అందులో ఉన్న సీసీ కెమెరాను ముందుగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఏటీఎం యంత్రాన్ని తెరిచేందుకు ఇద్దరూ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ దాన్నితెరవడం ఇద్దరి వల్లా కాలేదు. ఈలోపు వారికి జరగాల్సిననష్టం జరిగిపోయింది.

కరోనా వేళ ముఖం కనపడకుండా మాస్కులు ధరించి చోరీకి వచ్చారు ఇద్దరు దొంగలు. ఏటీఎంలో సీక్రెట్ వెనుకాల ఉన్న సీసీ కెమెరాను గుర్తించలేకపోయారు. ముందు సీసీ కెమెరాను పగుల కొట్టారు. కానీ వెనుకాల ఉన్న ఇంకోదాన్ని గుర్తించలేదు. చివరకు ఆ సీసీ కెమెరాను చూసిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశాడు ఏటీఎం నిర్వాహకుడు. ప్రస్తుతం ఆ దొంగల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమానితులపై ఆరాతీస్తున్నారు.