చైనా బయోవార్.. భారత్ కు పెను ముప్పు?

 చైనా.. ప్రపంచానికి పెనువిపత్తుగా మారుతోంది. చైనీయుల అలవాట్లు.. వారి పోకడలు మానవాళికి ముప్పును తీసుకొస్తున్నాయి. ప్రధానంగా చైనాయులు తీసుకునే ఆహారంపై జంతు ప్రేమికుల నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చైనీయుల మెనూ లిస్టు చదవాలంటేనే ఒళ్లంతా గుజ్జుస్సాకరంగా మారిపోవడం ఖాయం. ఎలుకలు.. పిల్లులు.. కుక్కులు, నక్కలు.. పందులు ఇలా దేనిని విడిచిపెట్టరు. ఆఖరికి చీమలను కూడా వదిలిపెట్టారంటే చైనీయుల ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. Also Read: యూపీ అత్యాచార బాధితురాలి మృతి.. […]

Written By: NARESH, Updated On : September 29, 2020 3:41 pm

china

Follow us on

 చైనా.. ప్రపంచానికి పెనువిపత్తుగా మారుతోంది. చైనీయుల అలవాట్లు.. వారి పోకడలు మానవాళికి ముప్పును తీసుకొస్తున్నాయి. ప్రధానంగా చైనాయులు తీసుకునే ఆహారంపై జంతు ప్రేమికుల నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చైనీయుల మెనూ లిస్టు చదవాలంటేనే ఒళ్లంతా గుజ్జుస్సాకరంగా మారిపోవడం ఖాయం. ఎలుకలు.. పిల్లులు.. కుక్కులు, నక్కలు.. పందులు ఇలా దేనిని విడిచిపెట్టరు. ఆఖరికి చీమలను కూడా వదిలిపెట్టారంటే చైనీయుల ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Also Read: యూపీ అత్యాచార బాధితురాలి మృతి..

ఒకరి ఆహార అలవాట్లను మనం తప్పుపట్టకూడదు కానీ.. దాని వల్ల ప్రపంచానికి మేలు కంటే కీడు జరుగుతుంటే మాట్లాడుకోక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే చైనా ప్రపంచానికి ఎన్నో కొత్త రోగాలకు బహుమతిగా ఇచ్చి తాను మాత్రం సేఫ్ గా ఉంటోంది. దీంతో చైనాపై అనేక దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ను కూడా పరిచయం చేసింది చైనానే. వూహాన్లో కరోనా సోకి వేలాది మంది చనిపోయిన విషయాన్ని సైతం చైనా బయటపడకుండా దాచిపెట్టింది. చైనాపై అనేక ఆరోపణలు రావడంతో గత్యంతరలేక డబ్ల్యూహెచ్ఓకు కరోనా మహ్మమరిపై సమాచారం అందించింది.

అయితే అప్పటికీ జరుగరాని నష్టం జరిగిపోయింది. ప్రపంచ దేశాలన్నింటికి కరోనా వైరస్ పాకిన తర్వాత చైనా అసలు విషయాన్ని బయటిపెట్టిందనే అనుమానాలు ఉన్నాయి. కరోనా ప్రభావంతో చైనా కంటే చైనాయేతర దేశాలు ఎక్కువగా నష్టపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే కరోనా వైరస్ తో చైనా బిజినెస్ చేసింది. ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలం అవుతుంటే చైనా మాత్రం మాస్కులు.. శానిటైజర్లు.. వెంటిలేటర్లు తయారు చేస్తూ వ్యాపారం చేసి ఆర్థికంగా పుంజుకుంది.

Also Read: అమెరికా ఎన్నికల సరళి ఎలావుండబోతుంది?

ప్రపంచానికి పెనుసవాలుగా మారుతున్న రోగాలన్నీ కూడా చైనా నుంచే అన్నిదేశాలకు వ్యాపిస్తున్నాయి. చైనాకు పక్కనే ఉన్న భారత్ కు పెనుముప్పు మారుతోంది. కరోనా వైరస్ తో ఇప్పటికే భారత్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. రోజుకు వేలల్లో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా చైనాకు చెందిన ‘క్యాట్ క్యూ వైరస్(సిక్యూవీ)’ భారత్ వ్యాపించే ప్రమాదం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఎఆర్) అప్రమత్తం చేస్తోంది.

క్యాట్ క్యూ వైరస్ ఆర్ర్థోపోడ్‌ వర్గానికి చెందిన జీవులను వాహకాలుగా వాడుకుంటాయని తెలిపింది. క్యూలెక్స్‌ జాతి దోమలు.. పందులను ఆవాసాలుగా మార్చుకుంటాయని చైనా, తైవాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనాల్లో వెల్లడైందని ఐసీఎంఆర్‌ పేర్కొంది. భారత్ విషయానికొస్తే పందులు క్యాట్‌ క్యూ వైర్‌సకు ప్రాథమిక వాహకాలుగా పనిచేసే అవకాశాలు ఉన్నాయట. దేశవ్యాప్తంగా సేకరించిన 883సీరం శాంపిళ్లను వైరాలజీ శాస్త్రవేత్తలు పరీక్షించగా, రెండు నమూనాల్లో క్యాట్‌ క్యూ వైర్‌సను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను గుర్తించారు.

ప్రస్తుతం ఈ వైరస్‌ ఎంతమందిలో ఉన్నదీ తెలియాలంటే.. మరిన్ని శాంపిల్స్‌ను పరీక్షించాల్సి ఉంటుంది. మనుషులతోపాటు పందులు, దోమల నుంచి శాస్త్రవ్తేతలు శాంపిళ్లను సేకరించిపే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతీసారి చైనా నుంచే కొత్త వైరస్ లు పుట్టుకొస్తుండటంతో చైనా కృత్రిమ బయోవార్ కు తెరతీసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: బీజేపీకి షాకిచ్చేలా సోనియా మాస్టర్ ప్లాన్

కరోనాతోనే ఈ విషయం అన్ని దేశాలకు అర్థమైందని అమెరికా బహిరంగగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మూకుమ్మడికి చైనాను కట్టడి చేయాల్సిన ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లేకపోతే చైనా కృత్రిమ వైరస్ లతో మానవళి మనుగడ ప్రశార్థకంగా మారే ప్రమాదం ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి.