https://oktelugu.com/

Hyderabad: చల్ చల్ రే.. ఉద్యోగానికి కేరాఫ్ హైదరాబాద్

Hyderabad: కరోనా వచ్చిన తర్వాత అంత ఒక్కసారిగా మారిపోయింది. మనం ఎప్పుడు విననివి కూడా కరోనా వచ్చిన తర్వాత వింటున్నాం.. ఇక కరోనా తర్వాత చాలా మంది ఉద్యోగులు ఇప్పటికీ ఇంటి నుండే పని చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారు ఇంకా మంచిది దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారు. అసలు ఉద్యోగం లేని నిరుద్యోగులు కూడా ఉద్యోగ వేటలో అలసి పోతున్నారు. అయితే ఇలా ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారు హైదరాబాద్ నగరానికి పెద్ద పీట వేస్తున్నట్టు […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 23, 2021 / 01:10 PM IST
    Follow us on

    Hyderabad: కరోనా వచ్చిన తర్వాత అంత ఒక్కసారిగా మారిపోయింది. మనం ఎప్పుడు విననివి కూడా కరోనా వచ్చిన తర్వాత వింటున్నాం.. ఇక కరోనా తర్వాత చాలా మంది ఉద్యోగులు ఇప్పటికీ ఇంటి నుండే పని చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారు ఇంకా మంచిది దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారు. అసలు ఉద్యోగం లేని నిరుద్యోగులు కూడా ఉద్యోగ వేటలో అలసి పోతున్నారు.

    Hyderabad

    అయితే ఇలా ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారు హైదరాబాద్ నగరానికి పెద్ద పీట వేస్తున్నట్టు తాజాగా నిరూపితం అయ్యింది. ఇండీడ్ జాబ్ సెర్చింగ్ యాప్ తమ విశ్లేషణలో ఇది నిరూపితం అయ్యిందని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ తో పాటు బెంగుళూరు, ముంబై నగరాల్లో జాబ్ చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో పూణే, చెన్నై ఉన్నాయి.

    Also Read: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో

    ప్రస్తుతం 2020 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ప్రొఫెసర్ ఉద్యోగానికి 2,448 శాతం అధికంగా జాబ్ పోస్టింగ్స్ వచ్చాయి. ప్రొఫెసర్ ఉద్యోగం కోసం వెతికే వారి సంఖ్య పెరుగుతుందట. ఈ క్రమంలో ప్రొఫెసర్, లోన్ ఆఫీసర్, రిక్రూట్ మెంట్ మేనేజర్, ప్యాకేజేర్ ఉద్యోగాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ ఉద్యోగాలు కోసం చాలా కంపెనీలు ప్రకటనలు ఇస్తున్నారు.

    ఆర్ధిక వ్యవస్థ గాడిన పడుతున్న సందర్భంగా క్రెడిట్ మేనేజర్, లోన్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాలకు గిరాకీ పెరిగింది. ఇంకా అన్ని కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఈవెంట్ కో ఆర్డినేటర్, ట్యాక్సీ డ్రైవర్, కస్టమర్ సర్వీస్ సూపర్ వైజర్ వంటి ఉద్యోగ నియామకాలు పెరుగు తున్నాయి. ఇంకా సాఫ్ట్ వేర్ ఇంజనీర్, సీనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఉద్యోగాలు, నియామకాలు ఎలా ఉంటాయి అనే విషయంపై ఇప్పుడే చెప్పలేమని ఇండీడ్ హెడ్ సేల్స్ శశి కుమార్ అన్నారు.

    Also Read: ఆర్మీ స్కూల్ లో టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

    Tags