తొలి రౌండ్లో దూసుకెళుతున్న కారు.. యూసఫ్ గూడలో బోణికొట్టిన టీఆర్ఎస్..!

పోస్టల్ ఓట్లలో వెనుకబడ్డ కారు గేర్ మార్చినట్లు కన్పిస్తోంది. ఇప్పటివరకు పలుచోట్ల తొలి రౌండ్ ఫలితాలు విడులయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ అధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా ఆ వెనుకే బీజేపీ.. ఎంఐఎంలు ఫాలో అవుతున్నాయి. పోస్టల్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తే బ్యాలెట్ ఓట్లలో మాత్రం టీఆర్ఎస్ దూసుకెళుతున్నట్లు తెలుస్తోంది. Also Read: జీహెచ్ఎంసీ ఫలితాలు: పాపం కాంగ్రెస్, టీడీపీలు తొలిరౌండ్‌ ఫలితాల్లో 42స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 19.. ఎంఐఎం 9.. కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఆధిక్యతను […]

Written By: Neelambaram, Updated On : December 4, 2020 1:20 pm
Follow us on

పోస్టల్ ఓట్లలో వెనుకబడ్డ కారు గేర్ మార్చినట్లు కన్పిస్తోంది. ఇప్పటివరకు పలుచోట్ల తొలి రౌండ్ ఫలితాలు విడులయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ అధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా ఆ వెనుకే బీజేపీ.. ఎంఐఎంలు ఫాలో అవుతున్నాయి. పోస్టల్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తే బ్యాలెట్ ఓట్లలో మాత్రం టీఆర్ఎస్ దూసుకెళుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: జీహెచ్ఎంసీ ఫలితాలు: పాపం కాంగ్రెస్, టీడీపీలు

తొలిరౌండ్‌ ఫలితాల్లో 42స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 19.. ఎంఐఎం 9.. కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తున్నాయి. ఆర్సీపురం.. పటాన్‌చెర్వు.. చందానగర్‌.. హఫీజ్‌పేట్.. హైదరాబాద్‌ నగర్.. జూబ్లీహిల్స్‌.. ఖైరతాబాద్‌.. ఓల్డ్‌ బోయిన్‌పల్లి.. బాలానగర్‌.. చర్లపల్లి.. కాప్రా.. మీర్ పేట్-హెచ్ బీ కాలనీ.. శేరిలింగంపల్లి.. గాజులరామారం.. రంగారెడ్డి నగర్, కొత్తపేటలలో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు.

బేగంబజార్.. గోషామహల్.. దత్తాత్రేయ నగర్.. జాంబాగ్.. గన్ ఫౌండ్రీ.. మంగళ్ హట్ లలో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం తొలి రౌండ్ల టీఆర్ఎస్ అధిక్యంలో కొనసాగుతున్నారు.ఇక మోహదీపట్నంలో ఎంఐఎం బోణి కొట్టింది. అందరూ ఊహించినట్లుగానే తొలి ఫలితం మోహదీపట్నం నుంచే వెలువడింది. ఇక్కడ బీజేపీ.. ఎంఐఎం మధ్య హోరాహోరీ ఫైట్ నడిచినట్లు తెలుస్తోంది. ఈ ఉత్కంఠ పోరులో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందాడు.

Also Read: ఉత్కంఠను రేపిన తొలి ఫలితం.. విజేత ఎవరంటే?

యూసఫ్ గూడలో టీఆర్ఎస్ తొలి సీటు గెలుచుకొని ఖాతా తెరిచింది. టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ గెలుపొందాడు. తొలి రౌండ్ ఫలితాల ట్రెండ్ ను టీఆర్ఎస్ ఏమేరకు నిలబెట్టుకుంటుందనేది ఆసక్తిని రేపుతోంది. బీజేపీ సైతం టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుండటంతో తుది ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గ్రేటర్లో మాత్రం కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. నిన్న సాయత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేలా ప్రస్తుత ఫలితాలు వస్తుండటం గమనార్హం.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్