Amarinder Singh: పంజాబ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీకి గుండెకాయలా ఉన్న అప్పటి సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో పార్టీకి నష్టం కలుగుతోంది. అమరీందర్ సింగ్ రాజీనామాతో పంజాబ్ లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా అమరీందర్ సేవలు గుర్తించని పార్టీ ఆయనను పక్కకు పెట్టింది. ముఖ్యమంత్రిగా రాజీనామా చేయించింది. దీంతో ఆయన తన మనసు మార్చుకుని బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు చర్యలు కూడా ముమ్మరం చేశారు. దీంతో కాంగ్రెస్ లో భయం పట్టుకుంది.

అమరీందర్ సింగ్ మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు వెళ్లారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు వారించాలని ప్రయత్నాలు చేసినా ఆయన ఎవరికి అందుబాటులోకి రావడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ డైలమాలో పడుతోంది. అమరీందర్ రాకతో బీజేపీలో కూడా జోష్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఆయనను బీజేపీలోకి రావాల్సిందిగా మంత్రి అథవాలే ఆహ్వానించారు.
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. అమరీందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దూకు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టినా కొలిక్కి రాలేదు. దీంతో అమరీందర్ రాజీనామా వరకు వెళ్లింది. పార్టీలో సీనియర్ మంత్రులందరు అమరీందర్ నాయకత్వాన్ని పట్టించుకోకపోవడంతో సెప్టెంబర్ 18న అమరీందర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఇన్నాళ్లు పార్టీని కాపాడినా ఆయనకు తగిన గుర్తింపు లేదనే ఆవేదనతో బీజేపీలో చేరాలని భావించారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దీంతో అమరీందర్ సిద్దూపై సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ తో సంబంధాలున్నాయని బాంబు పేల్చారు. గతంలో బీజేపీతో అకాలీదళ్ శిరోమణి పార్టీతో మిత్రపక్షంగా ఉన్నా తరువాత పరిణామాలతో విడిపోయింది. దీంతో పంజాబ్ లో బలం పెంచుకోవాలంటే అమరీందర్ సేవలు బీజేపీకి అవసరమని గుర్తించి ఆయనను పార్టీలోకి రప్పిస్తున్నారని తెలుస్తోంది.