Sridevi Drama Company : బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ షో మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఈ షో కి ఇంద్రజ జడ్జి గా వ్యవహరిస్తుండగా… సుధీర్ హోస్టింగ్ చేస్తున్నాడు. ప్రతి ఆదివారం కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో అలరించే షో ఈ ఆదివారం కూడా అలాంటి అధ్బుతమైన కాన్సెప్ట్ తో ముందుకు రానుంది.

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఎంటర్టైన్మెంట్ తో పాటు హృదయాన్ని హత్తుకునేలా ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమో ప్రతి ఒక్కరి హృదయాలు హత్తుకునేలా ఎమోషల్ గా ఉంది.ఎప్పుడూ నవ్వించే సుడిగాలి సుధీర్ కన్నీళ్లు ఆపుకోలేక పోయాడు. కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు.
ప్రతివారం కొత్త కాన్సెప్ట్ తో అలరించే ఈ షో కి తాజా ఎపిసోడ్ లో ఓ ఓల్డేజ్ హోమ్ లో వృద్దులని ఆహ్వానించారు. అసలు తల్లిదండ్రులల్ని ఓల్డేజ్ హోమ్ లో వదిలేసి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనే తరహాలో ఈ ఎపిసోడ్ సాగినట్లు ఉంది. ఓల్డేజ్ హోమ్ లో ఉన్న వారందరిని పిలిచి వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ఒక ఈవెంట్ చేస్తే బావుంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు యాంకర్ సుధీర్ తెలిపాడు.
ఓల్డేజ్ హోమ్ నుంచి వచ్చిన వృద్ధ మహిళలతో తనదైన శైలిలో పంచ్ లు, జోకులు వేస్తూ నవ్వించాడు హైపర్ ఆది. అంతే కాకుండా ఒక వృద్ధ మహిళ కి లవ్ ప్రపోజ్ చేస్తూ షో లో ఉన్న ప్రతి ఒక్కరిని నవ్వించాడు. దీనితో ఆటో రామ్ ప్రసాద్.. హమ్మయ్య ఆది గాడికి పెయిర్ దొరికేసింది అని అంటాడు. ఒక వృద్ధురాలు “అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి అంటూ” ఒక పాట పాడితే షో లో ఉన్నాందరు కంటతడి పెట్టగా…. ఇంద్రజ వచ్చి పాట పాడిన వృద్ధురాలిని గట్టిగా కౌగిలించుకుంది.
ఇదిలా ఉండగా అక్కడికి వచ్చిన ఓల్డేజ్ హోమ్ వారికి భాను, వర్ష ఇద్దరూ రూ లక్ష ఆర్థిక సాయం అందించారు. ఇక నటి ఇంద్రజ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకురాలితో మాట్లాడింది. నెలకు వీళ్లకు మెడికల్ ఖర్చులు ఎంత అవుతాయి అని అడిగింది. దీనితో ఆమె లక్ష నుంచి లక్షన్నర వరకు అవుతుందని చెప్పింది. మీ అకౌంట్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి.. ఇక నుంచి ప్రతి నెలా నేను డబ్బు పంపుతాను అంటూ ఇంద్రజ వారికి హామీ ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది.