India Vs Canada: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో ఆరోపణలు చేస్తూ ఇప్పటికే కెనడా భారతదేశంలో దౌత్య సంబంధాలను నిషేధించింది. భారత్ కూడా అంతకంటే తెలివిగా సమాధానం చెప్పింది. ఈ చర్చ ఇలా జరుగుతుండగానే తాజాగా భారతదేశంతో మరో దేశం దౌత్య కార్యకాలపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.. శాంతి కాముక దేశంగా, అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు దౌత్యపరమైన కార్యకలాపాలను ఆ దేశం ఎందుకు నిలిపివేసింది? హఠాత్తుగా ఆ నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించింది?
భారతదేశంతో దౌత్య పరమైన కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని ఆఫ్గనిస్తాన్ రాయబార కార్యాలయం ప్రకటించడం సంచలనం కలిగించింది. భారత ప్రభుత్వం నుంచి తమకు ఆశించినంత స్థాయిలో మద్దతు లభించకపోవడంతో న్యూఢిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం నుంచి మూసివేస్తున్నామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. దీని పట్ల తాము విచారం వ్యక్తం చేస్తూ ఉన్నామని పేర్కొన్నది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. భారత్ తో చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలను, అనేక అంశాలను పరిశీలనలోకి తీసుకున్న తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. తమ దేశం పట్ల భారత్ అంతగా ఆసక్తి చూపించడం లేదని, తమకు కేటాయించిన రాయబార కార్యాలయంలో సిబ్బంది, వనరులను తగ్గించిందని వాపోయింది. దీంతో తమ కార్యకలాపాలను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మరో మార్గం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆఫ్గనిస్తాన్ ప్రకటించింది.
అయితే రాయబార కార్యాలయంలో అధికారాన్ని భారతదేశానికి తిరిగి అప్పగించేంతవరకు, ఇక్కడ ఉన్న అప్ఘాన్ పౌరులకు అత్యవసర కౌన్సిలర్ సేవలు అందుబాటులో ఉంటాయి. దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ 1961 లోని ఆర్టికల్ 45 ప్రకారం రాయబార కార్యాలయం ఆస్తి, సౌకర్యాలు ఆతిథ్య దేశ సంరక్ష అధికారానికి బదిలీ చేస్తారు. కాగా, భారత దేశంలో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశ రాయబారిగా ఫరీద్ మముంద్ జాయ్ వ్యవహరిస్తున్నారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోకముందు అష్రఫ్ ఘనీ ని ప్రభుత్వం నియమించింది. ఇక 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్ళింది. ఇక వారి అధికారంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి మహిళలు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పైగా తాలి బన్లు విద్వేషమైన పాలన కొనసాగిస్తుండడం.. అక్కడి పౌరులకు కనీస హక్కులు లేకుండా చేస్తుండడం వల్లే భారత్ ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయానికి సహాయ నిరాకరణ చేసినట్టు తెలుస్తోంది.