Photo Story: టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు స్పెషల్ ఇమేజ్ ఉంది. నందమూరి వారసత్వాన్ని పుచ్చుకున్న ఈ యంగ్ టైగర్ దూకుడు యాక్టింగ్ తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తాడు. జూనియర్ నటించిన గత సినిమా ‘ఆర్ఆర్ఆర్’ లోని ఓ సాంగ్ కు ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ ఇమేజ్ ఇంటర్నేషనల్ లెవల్లోకి వెళ్లింది. దీంతో ఆయనతో కొందరు డైరెక్టర్లు భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల డైరెక్షన్లో ‘దేవర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఓచిన్న పాపతో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పాప ఎవరో తెలుసా?
ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరికి ఆడపిల్లలు లేరు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. దీంతో ఎక్కడ అమ్మాయి కనిపించినా వారిపై ఆప్యాయతను కురిపిస్తారు. ఇటీవల దేవర షూటింగ్ లో పాల్గొన్న సందర్భంగా ఈ అమ్మాయిని చూడగానే జూనియర్ ఇంప్రెస్ అయ్యారు. ఆమెను దగ్గర తీసుకున్నారు. ఇంతలో కొందరు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఈ ఫొటోను కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో ఈమె ఎవరు? అనే ఆసక్తి చర్చ సాగుతోంది.
అయితే ఈమెకు ఎన్టీఆర్ కు ఎటువంటి రిలేషన్ షిప్ లేదు. ఆమె జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కు మేనకోడలు అవుతుంది. షూటింగ్ సందర్భంగా ఆటో రాంప్రసాద్ తనతో తీసుకురాగా ఎన్టీఆర్ ఆమెను చూసి మురిసిపోయాడు. ఈ విషయాన్ని ఆటో రాంప్రసాద్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే ఈ విషయం తెలియక చాలా మంది ఎన్టీఆర్ కు ఈ పాప ఏమవుతుంది? ఆమె ఎవరు? అని రకరకాల పోస్టులు పెట్టారు.
ఎన్టీఆర్ ‘దేవర’తో బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని లుక్స్ ఇప్పటికే బయటకు వచ్చాయి. ఇందులో విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఆయనకు సంబంధించిన ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఇదివరకు జనతా గ్యారేజ్ మూవీ బంపర్ హిట్టు కొట్టింది. ఇప్పుడు దేవర కూడా సక్సెస్ అవుతుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.