
ఫ్యూచర్‌లో అందరం కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అనే పరిస్థితులను చెప్పుకోవాల్సింది వస్తుందేమో. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ముప్పుతిప్పల పెడుతోంది. ఇండియా ఆర్థిక మూలాలనే దెబ్బతీసింది. ఈ ప్రభావం ప్రజల మీద పడింది. కొంత మంది ఉద్యోగాలు కోల్పోయారు.. చాలా మంది ఉపాధి పోయింది. ఎంటర్‌టైన్‌మెంట్లు.. పార్టీలు.. పెళ్లిళ్లు.. ఫంక్షన్లు ఎటూ వెళ్లే పరిస్థితి లేదు. కరోనా తర్వాత ఓ ఆసక్తి కరణమైన వినిపిస్తోంది. అదే ఫుడ్ వేస్టేజ్. కరోనాకు ముందున్నంత వేస్టేజ్ ఇప్పుడు లేదని అంటున్నారు నిపుణులు. ఆహార వృథాను తగ్గించారంట. రెస్టారెంట్లు మూసివేయడం, పార్టీస్ లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది చెబుతున్నారు.
Also Read: కరోనాపై మరో అధ్యయనం.. షాకింగ్ న్యూస్
లాక్‌డౌన్‌కు ముందున్న పరిస్థితులతో పోలిస్తే40 నుంచి 18 శాతానికి ఆహార వృథా తగ్గిందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. ఎక్కువ వంటకాలు, రాత్రి మిగిలిన వంటకాలను మరుసటి రోజు పారేయడం, బయటి ఆహారాన్ని తెచ్చుకోవడం వంటి అలవాట్లతో పట్టణాల్లో వృథా 50–55 శాతం ఉంటుంది. అది గ్రామాల్లో 30–35 శాతమే. అధిక తిండితో ఊబకాయం, డయాబెటిస్, గ్యాస్ట్రిక్ వంటి రోగాలు వస్తాయని, దీని బారిన పడకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. క్రమక్రమంగా వైరస్ అధికమౌతుండడంతో విటమిన్లతో కూడిన ఫుడ్‌ను తింటున్నారు.
కరోనాను తట్టుకునేందుకు ప్రధానంగా కావాల్సింది ఇమ్యునిటీ పవర్. ప్రస్తుతం జనం ఇమ్యునిటీ పవర్ పెంచుకునే పనిలో పడ్డారు. అందుకు ప్రధానంగా పాలు, పెరుగు, గుడ్లు, చికెన్, బ్రౌన్ రైస్‌ని ఎక్కువగా తింటున్నారు. ఇంట్లో నూనె వంటకాలను బాగా తగ్గించారు. ఎక్కువ మొత్తంలో వంటలు చేసి పారేయడం మానుకున్నారు.
Also Read: రాత్రి యాపిల్, అరటి పండు తినడం మంచిది కాదా.?
ఇందుకు ప్రధాన కారణం ప్రజల ఆదాయం దెబ్బతినడమే. ఉద్యోగాలు కోల్పోవడం. మార్కెట్‌లోనూ రేట్లు మండిపోతుండడంతో పొదుపు మంత్రం పఠిస్తున్నారు. పట్టణ ప్రజల ఆదాయం సుమారు 40 శాతం మేర తగ్గింది. నెల చివరికొచ్చే సరికి చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి. తాజాగా ఉండే ఆహారాన్నే వండుకొని తింటున్నారు. హైదరాబాద్‌లోనే 75 శాతానికి పైగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. చాలా రెస్టారెంట్లు తమ మెనూ తగ్గించాయి. డిమాండ్ ఉన్న కొద్ది వంటకాలనే అందుబాటులో ఉంచాయి. దీంతో వృథా చాలా మేరకు తగ్గిందంటున్నారు.
Comments are closed.