https://oktelugu.com/

మోడీని కేసీఆర్‌‌ ఎదుర్కోగలడా..?

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఎప్పటి నుంచో కేసీఆర్‌‌ ఉవ్విల్లూరుతున్నారు. ఆయన టార్గెట్‌ కూడా ప్రధాని మోడీనే. ఇప్పటికే ఎన్నో సార్లు ప్రధానిపై విమర్శలు చేశారు. ఎన్నోసార్లు కేంద్రాన్ని టార్గెట్‌ చేశారు. గత 2019 ఎన్నికల్లోనూ ఈ ప్రయోగానికి ఆయన రెడీ అయ్యారు. తృతీయ ప్రత్యామ్నాయం అంటూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో తిరిగి మోడీ వ్యతిరేక వర్గాన్ని కలిశారు. చర్చించారు. కూటమికి ప్రయత్నాలు చేశారు. అయితే.. అప్పటికి సమయం మించిపోవడంతో కేసీఆర్ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. Also Read: […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 19, 2021 / 01:53 PM IST
    Follow us on


    జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఎప్పటి నుంచో కేసీఆర్‌‌ ఉవ్విల్లూరుతున్నారు. ఆయన టార్గెట్‌ కూడా ప్రధాని మోడీనే. ఇప్పటికే ఎన్నో సార్లు ప్రధానిపై విమర్శలు చేశారు. ఎన్నోసార్లు కేంద్రాన్ని టార్గెట్‌ చేశారు. గత 2019 ఎన్నికల్లోనూ ఈ ప్రయోగానికి ఆయన రెడీ అయ్యారు. తృతీయ ప్రత్యామ్నాయం అంటూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో తిరిగి మోడీ వ్యతిరేక వర్గాన్ని కలిశారు. చర్చించారు. కూటమికి ప్రయత్నాలు చేశారు. అయితే.. అప్పటికి సమయం మించిపోవడంతో కేసీఆర్ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.

    Also Read: ఆ సర్వే ప్రకారం బెంగాల్‌ మళ్లీ దీదీదే..

    ఇక.. ఇప్పుడు మరోసారి దేశరాజకీయాలపై దృష్టి సారించారు కేసీఆర్‌‌. అందుకే ఆ ప్రయత్నాలన్నింటినీ ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే ప్రారంభించేందుకు రెడీ అయ్యారనే సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తన సీఎం పదవిని తన కుమారుడికి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితిలో నరేంద్ర మోడీని ఢీ కొట్టడం అంటే.. కేసీఆర్‌‌కు సాధ్యమయ్యే పనేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన నాయకుడిగా మోడీ ఎదిగిపోయారు. ముఖ్యంగా యూపీ బీహార్ వంటి కేంద్రాన్ని నిర్దేశించే రాష్ట్రాల్లో మోడీకి తిరుగులేని ఆధిపత్యం ఏర్పడింది. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ అంటే.. అంతో ఇంతో అభిమానం చూపించిన బీఎస్పీ ఆర్జేడీ వంటి పార్టీల్లోనూ ఇప్పుడు.. ఆ తరహా పరిస్థితి లేకుండా పోయింది. వీరు ఇప్పుడు కేసీఆర్‌‌కు మద్దతు తెలుపుతారా? అంటే.. కష్టమనే వినిపిస్తోంది.

    ఇప్పటివరకు దేశాన్ని ఏలిన వారిలో ప్రధానంగా ఉత్తరాది నుంచి ఎదిగిన లీడర్లే. ఉత్తరాదిన పుంజుకున్న నాయకుడు మాత్రమే కేంద్రంలో పగ్గాలు చేపట్టడం లేదా.. కేంద్రంలోని ప్రభుత్వానికి శాసించే స్థాయికి ఎదుగుతారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం రైతు వ్యతిరేక చట్టాలను ఆసరా చేసుకుని కొందరు ఈ ప్రయత్నం చేస్తున్నా.. ఈ జాబితాలో కేసీఆర్ లేకపోవడం గమనార్హం.

    Also Read: ‘ఆర్నాబ్’ వాట్సాప్ చాట్స్.. వెలుగుచూస్తున్న సంచలన నిజాలు..!

    కేంద్రం వ్యవసాయ చట్టాలను ప్రకటించినప్పుడు కొన్నాళ్లు కేసీఆర్ ఈ చట్టాలను వ్యతిరేకించారు. కానీ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఈ పరిణామం.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయనకు పరీక్షగా మారనుంది. ఇక దక్షిణాదిలోని రాష్ట్రాలను చూస్తే.. కర్ణాటక మినహా.. కేరళ ఏపీ తమిళనాడులో ఒక్క కేరళలో మాత్రమే మోడీని వ్యతిరేకించే పార్టీలు ఉన్నాయి తప్ప.. తమిళనాడు ఏపీలో లేవు. ఈ పరిణామాలను గమనిస్తే.. కేసీఆర్ వ్యూహం అంత తేలికగా ఫలించే పరిస్థితి కనిపించడం లేదన్నది విశ్లేషకుల మాట. చివరగా కేసీఆర్‌‌ ప్లాన్‌ ఏంటో.. ఆయన ఏం చేయబోతున్నారో తెలియకుండా ఉంది. మరికొన్ని రోజులు వెయిట్‌ చేస్తే గానీ అసలు విషయం అర్థమయ్యేలా లేదు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్