Brother Sister Love ‘అన్నా-చెల్లి’ ఈ అనుబంధానికి ఎంతో విలువ.. ప్రత్యేకత ఉంటుంది. పవిత్రమైన ఆ బంధానికి కూడా ఈ పాకిస్తాన్ మేధావులు కలంకం తెచ్చారు. పాకిస్తాన్ లోని ఓ దేడ్ ధిమాక్ యూనివర్సిటీ ఈ ప్రశ్నను ఇచ్చి విద్యార్థులను రాయమని కోరింది. ఈ ప్రశ్న ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది.
ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న రూపొందించిన పాకిస్థాన్‌లోని ఓ యూనివర్సిటీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇస్లామాబాద్‌కు చెందిన కోమ్ సాట్స్ యూనివర్సిటీ ఇంగ్లీష్ కంపోజిషన్ అండ్ కాంప్రహెన్షన్ ప్రశ్నపత్రంలో అన్నదమ్ముల మధ్య ప్రేమ, శృంగారం గురించి తమ అభిప్రాయాన్ని పంచుకోవాలని విద్యార్థులను కోరింది. బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (బీఈఈ) విద్యార్థులను 300 పదాల వ్యాసం రాయమని కోరింది. – ‘అన్న మరియు సోదరి ప్రేమించడం సరైందేనా?’ అనే ప్రశ్నపత్రం యొక్క స్క్రీన్‌షాట్‌లు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Stop dusting the filth under the carpet to protect the culprits. Is it enough to fire that moron who asked such a filthy question?Don’t the higher ups in the university know what’s going on? Or is the #comsatsuniversity owned by the teacher? Stop this nonsense rant #COMSATS pic.twitter.com/7GMBZ3ynTK
— Mishi khan (@mishilicious) February 20, 2023
“సిగ్గుపడండి యూనివర్సిటీ దద్దమ్మల్లారా.. మీ దయనీయమైన యూనివర్సిటీకి సీలు వేయాలి & దిక్కుమాలిన ఉపాధ్యాయులను తరిమి కొట్టాలి. ఈ ప్రశ్న ఎవరు అడిగినా కటకటాల వెనుక ఉండాలి. ఈ నీచమైన ప్రశ్న అడగడానికి మీకు ఎంత ధైర్యం?” అని పాకిస్తాన్ నటుడు , గాయకుడు మిషి ఖాన్ ట్విట్టర్‌లో దుమ్మెత్తిపోశాడు.
“పాకిస్తాన్‌లోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు పాకిస్థాన్ యువతను.. మన సంస్కృతి, మతపరమైన విలువలను నాశనం చేసే లక్ష్యంతో ఉన్నాయి” అని ఇమ్రాన్ ఖాన్‌కి చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)తో అనుబంధం ఉన్న షెహ్ర్యార్ బుఖారీ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత తరువాత, ప్రశ్నపత్రాన్ని సెట్ చేసిన ప్రొఫెసర్‌ను విశ్వవిద్యాలయం తొలగించి బ్లాక్‌లిస్ట్ చేసింది. గతేడాది డిసెంబర్‌లో ఈ పరీక్ష జరిగింది. విశ్వవిద్యాలయం క్విజ్‌లోని కంటెంట్‌ను “అత్యంత అభ్యంతరకరం” అని పేర్కొంది. ఇది “విద్యార్థుల కుటుంబాల మధ్య అశాంతికి కారణమైంది” అని పేర్కొంది.
మొత్తంగా పాకిస్తాన్ యూనివర్సిటీ చేసిన పని ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది.