Delhi Dog Relocation: ఢిలీ.. దేశ రాజధాని… వీవీఐ అపీలు, వీఐపీలు ఉండే నగరం. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రపంచ నేతలు, అధికారులతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రంలోని నేతలు కూడా వివిధ పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్తుంటారు. ఇక పర్యాటకంగా కూడా ఢిల్లీ ఎంతో అభివృద్ధి చెందింది. వేల మంది విదేశీయులతోపాటు స్వదేశీయులు కూడా ఢిల్లీ సందర్శనకు వస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఢిల్లీలో.. వీధి కుక్కలు అందరికీ తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ఒక్క వీధి కుక్క కూడా కనిపించొద్దని ఆదేశించింది. ఉన్న కుక్కలను ఆశ్రమ కేంద్రాలకు తరలించాలని పేర్కొంది. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఆదేశాలకు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (ఆర్‌డబ్ల్యూఏలు) నుంచి మద్దతు లభించగా, జంతు సంరక్షణ కార్యకర్తలు ఈ నిర్ణయం అమలు సాధ్యం కాదని, ఇది మానవ–కుక్కల సంఘర్షణను మరింత తీవ్రతరం చేస్తుందని వాదిస్తున్నారు.
Also Read: రాహుల్ గాంధీ ఎన్నికల కమీషన్ పై యుద్ధం వెనక కుట్ర కోణం?
సుప్రీం కోర్టు ఆదేశం..
సుప్రీం కోర్టు ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, గాజియాబాద్‌లలోని వీధికుక్కలను తలరించాలని స్థానిక అధికారులు, పాలకులను ఆదేశించింది. ఆరు నుంచి ఎనిమిది వారాల్లో 5 వేల కుక్కలకు ఆశ్రయం కల్పించే కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ కేంద్రాలలో స్టెరిలైజేషన్, టీకాలు, సీసీటీవీ పర్యవేక్షణ, భవిష్యత్తులో విస్తరణ సామర్థ్యం ఉండాలని తెలిపింది. కుక్కల కాటు సంఘటనలను నివేదించడానికి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ ప్రక్రియను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఆదేశాల అమలు సంక్లిష్టంగా మారింది.
ఆర్‌డబ్ల్యూఏల సమర్థన..
సుప్రీం కోర్టు ఆదేశాలను ఆర్‌డబ్ల్యూలు సమర్థిస్తున్నారు. సమాన్యులు కూడా పెంపుడు కుక్కలతో కలిగే ఇబ్బందులను లేవనెత్తుతున్నారు. సుప్రీం ఆదేశాలు అమలు చేయాలని కోరుతున్నారు. వీధి కుక్కలు రాత్రి పని చేసే వారికి, పిల్లలకు, వృద్ధులకు ముప్పుగా మారాయంటున్నారు. అయితే జంతు ప్రేమికులు తిరుగుడు కుక్కలను ఇంటికి తీసుకెళ్లి, వాటి టీకాలు, శిక్షణ, చికిత్సకు ఖర్చు చేయాలని వాదిస్తున్నారు. లేకపోతే, వీధుల్లో ఆహారం ఇవ్వడం సమస్యను పరిష్కరించదని వారు అంటున్నారు.
జంతు సంరక్షణ కార్యకర్తల ఆందోళన..
జంతు సంరక్షణ కార్యకర్తలు, కొంతమంది నెటిజన్లు ఈ ఆదేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, దీనిని జంతు సంక్షేమానికి విరుద్ధంగా, అమలు చేయడం అసాధ్యమైనదిగా పరిగణిస్తున్నారు. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో లక్షలాది తిరుగుడు కుక్కలను ఆశ్రయ కేంద్రాలకు తరలించడానికి భూమి, నిధులు, సిబ్బంది లేని పరిస్థితిలో ఈ ఆదేశం అసాధ్యమని వారు అంటున్నారు మానవులు జీవవైవిధ్యంలో భాగమని, ఇతర జాతులను నిర్మూలించే హక్కు మనకు లేదని వారు వాదిస్తున్నారు. ఈ ఆదేశం జీవశాస్త్ర సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్, 2023, రాజ్యాంగంలోని జంతు సంక్షేమ విధులను ఉల్లంఘిస్తుందని వారు ఆరోపిస్తున్నారు.వీధి కుక్కలు ప్రేమ, విశ్వాసానికి చిహ్నాలని, వాటిని తొలగించడం సమాజంలో ప్రేమను నశింపజేస్తుందని భావిస్తున్నారు.
Also Read: రాహుల్ గాంధీ అరెస్ట్.. ఢిల్లీలో ఏం జరుగుతోంది..
సుప్రీం కోర్టు ఆదేశం వీధికుక్కల సమస్యకు ఒక ప్రయత్నంగా కనిపిస్తున్నప్పటికీ, దాని అమలు సవాళ్లు, సామాజిక విభజన దీనిని సంక్లిష్టమైన అంశంగా మార్చాయి. ప్రజా భద్రత, జంతు సంక్షేమం మధ్య సమతుల్య విధానం అవసరం.