ఢిల్లీలో ఆగని అల్లర్లు..పెరుగుతున్న మృతుల సంఖ్య..!

ఈశాన్య ఢిల్లీలో ప్రారంభమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల ఘర్షణ ఈ రోజుకి ఢిల్లీ తూర్పు ప్రాంతానికి వ్యాపించాయి. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. దింతో అల్లర్లను అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసుల బలం సరిపోవడం లేదని, వెంటనే ఆర్మీని రంగంలోకి దింపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు […]

Written By: Neelambaram, Updated On : February 26, 2020 4:16 pm
Follow us on

ఈశాన్య ఢిల్లీలో ప్రారంభమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల ఘర్షణ ఈ రోజుకి ఢిల్లీ తూర్పు ప్రాంతానికి వ్యాపించాయి. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. దింతో అల్లర్లను అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసుల బలం సరిపోవడం లేదని, వెంటనే ఆర్మీని రంగంలోకి దింపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఈ అల్లర్ల ఘటనపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. పోలీసులకు నోటీసులు జారీ చేసి, విచారణకు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దేశ రాజధానిలో 1984 నాటి తరహాలో అల్లర్లు పునరావృతం కాకూడదని, పూర్తి స్థాయిలో పౌరులకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. బాధితులను, వారి కుటుంబాలను ఉన్నతాధికారులు పరామర్శించాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోర్టు ఆదేశించింది.

అల్లర్లకు భయపడి బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లడానికి భయపడితే వారికి షెల్టర్లు ఏర్పాటు చేయాలని, షెల్టర్లలో బాధితులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని కోర్టు చెప్పింది. హెల్ప్‌లైన్లు, హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేసి ప్రజలకు సహాయం చేయాలి. క్షతగాత్రుల వద్దకు అంబులెన్స్‌లు సురక్షితంగా చేరేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అల్లర్లను అదుపు చేసే బాధ్యతను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కు కేంద్రం అప్పగించినట్టు తెలిసింది.