రక్త సిక్త మౌతున్న ఢిల్లీ!

గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ.. నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. దేశ రాజధానిలో దాదాపు రెండు నెలలుగా శాంతియుతంగా సాగుతున్న నిరసనలు రెండు రోజుల నుండి హింసాత్మకంగా మారాయి. దింతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులతో ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. కనిపిస్తే కలిచేస్తాం.. అంటూ ఢిల్లీ పోలీసులు హుకుం జారీ చేశారు. పోలీసులకు, సీఏఏ ను వ్యతిరేకిస్తున్న ఆందోళన కారులకు మధ్య […]

Written By: Neelambaram, Updated On : February 26, 2020 5:08 pm
Follow us on

గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ.. నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. దేశ రాజధానిలో దాదాపు రెండు నెలలుగా శాంతియుతంగా సాగుతున్న నిరసనలు రెండు రోజుల నుండి హింసాత్మకంగా మారాయి. దింతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఈ ఉద్రిక్త పరిస్థితులతో ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. కనిపిస్తే కలిచేస్తాం.. అంటూ ఢిల్లీ పోలీసులు హుకుం జారీ చేశారు. పోలీసులకు, సీఏఏ ను వ్యతిరేకిస్తున్న ఆందోళన కారులకు మధ్య జరిగిన పోరులో.. ఇప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మందికిపైగా గాయపాడారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ అర్థం కేసుకోవచ్చు. ఈశాన్య దిల్లీలోని మౌజ్‌ పూర్‌, జఫ్రాబాద్‌, చాంద్‌బాగ్‌, కర్వాల్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆందోళనలను అదుపుచేసేందుకే ఈ ఆదేశాలు జారీచేశామని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఢిల్లీ-ఘజియాబాద్‌ సరిహద్దును మూసివేశారు. 13పారామిలటరీ దళాలను రంగంలోకి దించారు. 10 సమస్యాత్మ ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులోకి తీసుకురావడంపై పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు. పరిస్థితిపై హోంమంత్రి అమిత్‌ షా సమీక్ష నిర్వహించారు.