Homeజాతీయ వార్తలుబిగ్ బ్రేకింగ్: ఉప ఎన్నిక వేళ.. కరీంనగర్ కలెక్టర్ బదిలీ

బిగ్ బ్రేకింగ్: ఉప ఎన్నిక వేళ.. కరీంనగర్ కలెక్టర్ బదిలీ

Collector Shashanka Transfer

హుజురాబాద్ ఉప ఎన్నికపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉప ఎన్నిక గడువు సమీస్తుండడంతో పాలనాపరమైన మార్పులు తీసుకుంటోంది. ఇప్పటికే కింది స్థాయి సిబ్బందిని బదిలీ చేసిన రాష్ర్ట ప్రభుత్వం సోమవారం రాత్రి పొద్దుపోయాక జిల్లా కలెక్టర్ శశాంకను ట్రాన్స్ ఫర్ చేసింది. జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ)కు రిపోర్టు చేయాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ను నియమించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్న వీపీ గౌతమ్ ను ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్న అభినవ్ ను తదుపరి పూర్తిస్థాయి కలెక్టర్ వచ్చేంద వరకు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వం బదిలీలకుతెర తీయడం గమనార్హం. ఒకవైపు గట్టుచప్పుడు కాకుండా ఆసరా పింఛన్లను మంజూరు చేస్తుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను చకచకా విడుదల చేస్తోంది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ను మార్చేసింది. ఇకనైనా పలు స్థాయిలో ప్రభుత్వ సిబ్బంది బదిలీ జరగనున్నాయి. ఎలాగూ దళితబంధు పథకం అమలు కోసం సమర్థుడైన అధికారులను నియమించనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే కలెక్టర్ ను బదిలీ చేయడం విశేషం.

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ను బదిలీ చేస్తూ రాష్ర్టప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హుజురాబాద్ తోపాటు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ను కూడా బదిలీ చేసింది. హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా మిర్యాలగూడ కమిషనర్ వెంకన్నను నియమించింది. జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గా మీర్ పేట్ కమిషనర్ సుమాన్ రావుకు బాధ్యతలు అప్పగించింది.

ప్రభుత్వం ఈమేరకు మార్పులు చేస్తున్న క్రమంలో హుజురాబాద్ లో త్వరలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులను బదిలీ చేయడంతో త్వరలో ఉప ఎన్నిక జరగడం అనివార్యమే అనిపిస్తోంది. ప్రభుత్వ చర్యలతో పార్టీలు కూడా ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తమ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version