
ఇప్పుడు ఏపీలో విశాఖ కేంద్రంగా హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎప్పుడైతే కేంద్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలని తలచిందో అప్పటి నుంచి పోరు నడుస్తోంది. పార్టీలకతీతంగా అందరూ ముందుకొచ్చి కేంద్రంపై, రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలోనే అతి పెద్ద సిటీగా ఉన్న విశాఖలో మేయర్ సీటు కోసం వచ్చే నెల పోలింగ్ జరగనుంది.
Also Read: ఆ మంత్రి టార్గెట్ అయ్యాడా..! : అందుకే ఈ ఏసీబీ సోదాలా..?
దీంతో ఇప్పుడు పార్టీలన్నీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక వైసీపీ సర్కార్ ఎటూ విశాఖను పాలనారాజధానిగా చేయబోతోంది. దాంతో విశాఖ మీదే అందరి చూపు ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ మరోసారి వేడి వేడి రాజకీయానికి కేంద్ర బిందువుగా మారబోతోంది. మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన స్పీకర్ ఫార్మెట్లోనే రెండో సారి తన రాజీనామా పంపించారు.
ఇప్పుడు ఆ పంచాయితీ అసెంబ్లీ కార్యదర్శి వద్ద ఉంది. మరోవైపు స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా గంటాతో ఫోన్లో మాట్లాడి రాజీనామాను కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో గంటా రాజీనామా విషయంలో స్పీకర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. స్పీకర్ కనుక గంటా రాజీనామా ఆమోదిస్తే ఆరు నెలలు తిరగకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అక్కడ ఎన్నికలు వస్తాయి. ఇదిలా ఉండగా ఇప్పటి నుంచే విశాఖ ఉత్తరాన్ని వైసీపీ టార్గెట్ చేసింది.
Also Read: ఆ నేతలు మారరా..?: ఇలా అయితే బెజవాడలో గట్టెక్కేదెలా..?
ఎంపీ విజయసాయిరెడ్డి సహా మంత్రి, ఇతర పెద్దలు అక్కడ పూర్తి దృష్టి పెట్టారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈసారి ఉత్తరాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ ఆరాటపడుతోంది. మొత్తానికి అధికార పార్టీ ఉత్తరంలో చేస్తున్న హడావుడి చూస్తే తొందరలోనే ఉప ఎన్నిక వచ్చేలాగా సీన్ కనిపిస్తోంది. అదే సమయంలో ఆ సీటును కైవసం చేసుకునేందుకు కూడా అన్ని రకాల ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్