Jaipur Delhi highway bus fire: దేశంలో ప్రవేటు బస్సుల్లో ప్రమాదాలు ఆగడం లేదు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు ప్రాంతంలో టేకూరు అనే గ్రామం సమీపంలో వేమూరి కావేరి సంస్థకు సంబంధించిన ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. దాదాపు 14 మంది దాకా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. అధికారులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కర్నూలు బస్సు ప్రమాదాన్ని మర్చిపోకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఈసారి కూడా ఓ ప్రైవేట్ బస్సు బుగ్గిపాలైంది. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు ప్రయాణికులు చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ , ఢిల్లీ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బస్సు సూపర్ స్పీడ్ లో ఉండగా హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంత ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకుంది. వైర్లు తగలడంతో ఒకసారిగా నిప్పు రవ్వలు ఏర్పడ్డాయి. చెలరేగడానికి కారణమయ్యాయి.
ఇటీవల కాలంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మేర్ ప్రాంతంలో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురి కావడంతో 26 మంది దుర్మరణం చెందారు. దాదాపు 20 కి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని మర్చిపోకముందే కర్నూలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని 20 మంది దాకా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనలు దేశవ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ఉన్న లోపాలను బట్టబయలు చేశాయి. ఈ ప్రమాదాలు మర్చిపోకముందే రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ఢిల్లీ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు సజీవ దహనమయ్యారు. పదిమంది గాయపడ్డారు.
వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టిఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల సందర్భంగా అనేక లోపాలు బయటపడుతున్నాయి. చాలావరకు బస్సుల్లో కనీస ప్రమాణాలు లేవు. ప్రమాదాలు జరుగుతున్నప్పుడు తీసుకోవలసిన రక్షణ చర్యలకు సంబంధించిన పరికరాలు కూడా లేవు. కొన్ని బస్సుల కైతే సామర్థ్యం కూడా లేదు. అయినప్పటికీ ట్రావెల్స్ సంస్థలు బస్సులను ఏకంగా అంతర్రాష్ట్ర సర్వీసులకు ఉపయోగిస్తుండడం విశేషం.